Skin Care Tips : పండక్కి మరింత అందంగా, గ్లోయింగ్‌గా కనిపించాలనుకుంటే ఈ స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అయిపోండి
చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల చర్మం తాజాగా అనిపిస్తుంది. ముఖంపై వాపును తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది.
రోజ్ వాటర్‌లో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది చర్మానికి చల్లదనాన్ని, తేమను అందిస్తుంది. ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది.
తేనెలో యాంటీ బాక్టీరియల్, తేమను అందించే గుణాలు ఉన్నాయి. తేలికపాటి తేనెతో ముఖాన్ని శుభ్రపరిస్తే చర్మంపై ఉండే మురికిని తొలగిస్తుంది. చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
కీర దోసకాయ రసం చర్మానికి చల్లదనాన్ని, తేమను అందిస్తుంది. ఇది రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. నలుపును తగ్గిస్తుంది.
అలోవెరా జెల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని శాంతపరుస్తుంది. హైడ్రేట్ చేస్తుంది. ఇది ఉదయాన్నే ముఖానికి అప్లై చేస్తే సహజమైన మెరుపును అందిస్తుంది.
పాలల్లో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది డెడ్ స్కిన్‌ను దూరం చేసి.. చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
నిమ్మరసం విటమిన్ C తో నిండి ఉంటుంది. దీనిని నీటిలో కలిపి లేదా దూదితో కొద్దిగా రాసి చర్మం మెరుపును పెంచుకోవచ్చు.