Lentils at Night : రాత్రుళ్లు పప్పు తింటున్నారా? అయితే జాగ్రత్త, ఈ సమస్యలుంటే తినకూడదట
పప్పును చాలామంది ఇష్టంగా తింటారు. అయితే ఇది ఆరోగ్యానికి కూడా చాలామంచి బెనిఫిట్స్ ఇస్తుంది. దీనిలో చాలా పోషకాలు ఉంటాయి.
పప్పులో ప్రోటీన్, జింక్, విటమిన్లు, ఇతర ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలు ఇస్తాయి.
అయితే కొన్ని సమస్యలున్నవారు రాత్రుళ్లు పప్పు తినకూడదట. ఎవరు పప్పు తినకూడదో.. దీనివల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునేవారు రాత్రుళ్లు పప్పు తినకూడదట. జీర్ణ సమస్యలున్నవారు కూడా రాత్రుళ్లు పప్పు తినకపోవడమే మంచిది.
నిద్ర సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా పప్పును తినకపోవడమే మంచిది. మలబద్ధకంతో ఇబ్బంది పడేవారు కూడా రాత్రుళ్లు పప్పు తినవద్దని సూచిస్తున్నారు.
కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా రాత్రిపూట పప్పు తినకపోవడమే మంచిదని చెప్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.