Alcohol During Emotional Distress : బాధలో ఉన్నప్పుడు మందు తాగడానికి కారణాలు ఇవే.. నిజంగానే రిలీఫ్ వస్తోందా?
మద్యం కేంద్ర నాడీ వ్యవస్థను మందగించేలా చేస్తుంది. దీనివల్ల భావోద్వేగాల నొప్పి తీవ్రత తగ్గుతుంది. తిమ్మెర కలిగించే ప్రభావాన్ని ఇస్తుంది కాబట్టి.. బాధాకరమైన జ్ఞాపకాలను, భావోద్వేగాలను దూరం చేస్తుంది. దీనివల్ల మనసు తేలికగా అనిపిస్తుంది. ఇది బాధ నుంచి కాస్త ఉపశమనం ఇస్తుంది.
మద్యం సేవించినప్పుడు.. మెదడు డోపమైన్ విడుదల చేస్తుంది. ఈ రసాయనం ఆనందంతో ముడిపడి ఉంటుంది. డోపమైన్ కొంతకాలం విచారాన్ని దూరం చేస్తుంది. దీనివల్ల విషయాలు మెరుగ్గా ఉన్నాయని మెదడు నమ్ముతుంది.
మద్యం మెదడులోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ను బలహీనపరుస్తుంది. ఇది నిర్ణయాలు, నియంత్రణ, తర్కాన్ని ఆలోచించడానికి బాధ్యత వహిస్తుంది. దీనివల్ల ప్రజలు మానసికంగా తమ సమస్యలను పునరావృతం చేయడం మానేస్తారు.
చాలా మందికి.. తాము కంట్రోల్ చేసుకోలేని భావోద్వేగాలను ఎదుర్కోవడానికి మద్యం ఒక వేగవంతమైన, సులభమైన మార్గంగా మారుతుంది. తమ భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి బదులుగా.. మెరుగ్గా భావించడానికి మద్యంపై ఆధారపడతారు.
అనేక కల్చర్స్లో బాధగా ఉన్నప్పుడు మద్యం సేవించడం సాధారణంగా పరిగణిస్తారు. సినిమాలు, పాటలు, స్నేహితుల బృందాలతో ఎంజాయ్ చేయడం వల్ల అనుభూతి మెరుగవుతుంది.
బాధ అనేది చాలామందిని నిస్సహాయులుగా లేదా కలవరపరుస్తుంది. మద్యం భావోద్వేగాలను తేలికపరచడం ద్వారా వారు తమ బాధ తగ్గుతుందని భావిస్తారు. కానీ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. అది కేవలం భ్రమనే.