SSC JE Recruitment 2025: ఇంజనీరింగ్ పాస్ అయిన అభ్యర్థులకు గుడ్ న్యూస్- ప్రభుత్వ ఉద్యోగం పొందే సువర్ణావకాశం
జూనియర్ ఇంజనీర్ (JE) కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేష్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు 21 జులై 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 1340 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ నియామకం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ల దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత సబ్జెక్టులో BE/BTech లేదా ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులు
వివిధ విభాగాలకు వేర్వేరు వయోపరిమితులు ఉన్నాయి. CPWD, CWC పోస్టులకు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు, అయితే ఇతర పోస్టులకు 30 సంవత్సరాలు నిర్ణయించారు. రిజర్వ్ చేసిన వర్గాలకు నిబంధనల ప్రకారం సడలింపు లభిస్తుంది. వయస్సును 1 ఆగస్టు 2025 నాటికి లెక్కిస్తారు.
ఈ నియామక పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి జనరల్, ఓబిసి, EWS కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 100 దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
అభ్యర్థులు మొదట స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్ ssc.gov.in ని సందర్శించాలి. ఇక్కడ దరఖాస్తు చేయడానికి ముందు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటిఆర్) చేయడం తప్పనిసరి. ఓటిఆర్ పూర్తయిన తర్వాత అభ్యర్థులు లాగిన్ చేసి “అప్లై” విభాగంలోకి వెళ్ళాలి.
JE భర్తీ 2025 లింక్ పై క్లిక్ చేయండి. అడిగిన మొత్తం సమాచారాన్ని దరఖాస్తులో ఫిల్ చేయండి. తరువాత డాక్యుమెంట్స్, ఫోటోలు, సంతకం అప్లోడ్ చేయండి. మీరు రుసుము చెల్లించడానికి అర్హులైతే, దానిని ఆన్లైన్లో చెల్లించండి. చివరగా ఫామ్ పూర్తి చేసిన తర్వాత సబ్‌మిట్ బటన్‌పై ప్రెస్ చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం దాని ప్రింట్ తీసి పెట్టుకోండి.