Assistant Manager Posts: PFRDAలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫకేషన్- అభ్యర్థుల అర్హత, ఫీజు వివరాలివే
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) 40 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 2, 2025 నుంచి పీఎఫ్‌ఆర్‌డీఏ అధికారిక వెబ్‌సైట్ లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 6, 2025 వరకు అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.
అర్హతల విషయానికి వస్తే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థి గరిష్ట వయస్సు 30 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వ్ చేసిన కేటగరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం మినహాయింపు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల మినహాయింపు ఇచ్చారు. ఓబిసి అభ్యర్థులకు 3 ఏళ్లపాటు మినహాయింపు లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే అభ్యర్థులు మూడు దశల ద్వారా సెలక్ట్ అవుతారు. మొదటి దశ పేపర్-I ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్, రీజనింగ్, మ్యాథ్స్ ఎబిలిటీ, రీనరింగ్ ఎబిలిటీ సంబంధించిన మొత్తం 80 ఆప్షనల్ ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఒక గంట సమయం లభిస్తుంది.
తరువాత పేపర్-II ఉంటుంది. ఇందులో సబ్జెక్టుకు సంబంధించిన 50 ఆప్షనల్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి 100 మార్కులకు ఉంటాయి. దీనికి 40 నిమిషాల సమయం కేటాయించారు. రెండు పరీక్షలలోనూ నెగెటివ్ మార్కింగ్ అమలు చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక పావు మార్కు తొలగిస్తారు. ఈ రెండు పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకి కాల్ వస్తుంది.