Dry ginger vs Fresh ginger: అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?

అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది?
అల్లం - శొంఠి..రెండూ ఒకే మూలిక నుంచి వస్తాయి. అల్లం తాజా దుంప అయితే..శొంఠి అదే అల్లాన్ని ఎండబెట్టి పొడిచేసినది. అయినప్పటికీ రెండింటి రుచి, ఉపయోగాలు, ఆయుర్వేద గుణాలు విభిన్నంగా ఉంటాయి
తాజాగా ఉండే అల్లం ఫ్రిజ్ లో కొన్ని వారాలపాటూ నిల్వఉంటుంది, శొంఠి పొడిపూరంలో సంవత్సరాలు నిల్వ ఉంటుంది. అల్ల తక్కువ ఘాటు ఉంటుంది..శొంఠి ఎండడం వల్ల ఎక్కువ ఘాటు ఉంటుంది.
ఆయుర్వేదపరంగా అల్లం త్వరగా పనిచేస్తుంది కఫాన్ని తగ్గిస్తుంది.. శొంఠి మూడు దోషాలను సమతుల్యం చేస్తుంది..ఎక్కువకాలం పనిచేస్తుంది.
అల్లం జీర్ణక్రియను తొందరగా పెంచుతుంది, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. శొంఠి కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది
జ్యూస్, సలాడ్స్ లో అల్ల వినియోగించవచ్చు.. శొంఠి పొడిని ఆయుర్వేద మందులు, టీ, వేడినీళ్ల ద్వారా వినియోగించవచ్చు
జలుబు, వికారం తగ్గించేందుకు తక్షణ ఉపశమనం అల్లం... దీర్ఘకాలిన సమస్యలైన నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలకు శొంఠి మంచిది
అల్లం, శొంఠి రెండూ ఆరోగ్యానికి మంచివే..ఏది ఎప్పుడు వినియోగించాలి అనేది మీ శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది.
అల్లం అయితే చిన్న ముక్క, శొంఠి చిటికెడు వినియోగం పర్వాలేదు..అంతకన్నా ఎక్కువ వాడితే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది