ముంబైలో ‘విరూపాక్ష’ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించింది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేయబోతున్నారు మేకర్స్.
తాజాగా ముంబైలో ‘విరూపాక్ష’ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది.
హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త మీనన్ తో పాటు సినిమా యూనిట్ ఈ వేడుకలో పాల్గొంది.
మే 5న ఈ సినిమా హిందీలో విడుదలకానుంది.
'విరూపాక్ష' మూవీని మొదట తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
కానీ, చివరకు కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. ఇక్కడ రెస్పాన్స్ బాగుంటే, ఆ తర్వాత ఇతర భాషల్లో డబ్ చేద్దామని అనుకున్నారు.
తెలుగు వర్షన్ కు అద్భుతమైన స్పందన రావడంతో.. ఇప్పుడు ఈ చిత్రాన్ని మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.
హిందీ, తమిళ మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ మూవీని హిందీలో గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ సంస్థ విడుదల చేయబోతోంది.