Sonia Singh Photos: 'విరూపాక్ష' లో నటించిన జూనియర్ మధుబాల బ్యూటిఫుల్ పిక్స్
రోజా సినిమాలో నటించిన హీరోయిన్ మధుబాల గుర్తుంది కదా అచ్చం అలాగే ఉంటుంది సోనియా సింగ్. అందుకే అభిమానులంతా జూనియర్ మధుబాల అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.
సోనియా సింగ్ 1998లో మార్చి 31న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. బీటెక్ చదివింది. యోగా చేయడం, ట్రావెలింగ్, పుస్తకాలు చదవడం బాగా అలవా. అయితే చదువు పూర్తయ్యాక పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించడం ద్వారా తన యాక్టింగ్ కెరీర్ ని ప్రారంభించింది.
‘హే పిల్ల’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయింది. ఆ తర్వాత రౌడీ బేబీ ఛానల్ తో మరింత ఫాలోయింగ్ పెంచుకుంది. పెళ్ళైన కొత్తలో, న్యూ ఏజ్ గర్ల్ ఫ్రెండ్, నాన్ తెలుగు గర్ల్ ఫ్రెండ్, హైడ్ అండ్ సీక్, గుడ్ న్యూస్, ఓయ్ పద్మావతి, ఈ మాయ పేరేమిటో, సాఫ్ట్ వేర్ సావిత్రి వంటి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లలో నటించింది.
పవన్ సిద్ధుతో కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లు బాగా పాపులర్ అయ్యాయి. వీరిద్దరి జోడీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మొదట్లో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చూసే వారికి మాత్రమే తెలిసిన సోనియా సింగ్.. తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిపోయింది.
‘యమలీల ఆ తరువాత’ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. బుల్లితెర మీద సత్తా చాటిన సోనియా సింగ్ రీసెంట్ గా సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. చలాకీతనం, సహజంగా ఉండే మాటలతో అందరినీ బాగా ఆకట్టుకుంటోంది సోనియా.
సోనియా సింగ్ (Image Credit: Sonia Singh / Instagram)
సోనియా సింగ్ (Image Credit: Sonia Singh / Instagram)
సోనియా సింగ్ (Image Credit: Sonia Singh / Instagram)
సోనియా సింగ్ (Image Credit: Sonia Singh / Instagram)