Priyanka Nalkari Wedding Photos: స్మాన్ స్క్రీన్ బ్యూటీ ప్రియాంక నల్కరీ పెళ్లి ఫొటోస్
తెలుగులో పలు టీవీ సీరియళ్లు, టీవీ షోస్‌లో నటించిన ప్రియాంక నల్కారి గురువారం (మార్చి 23న) పెళ్లి చేసుకుంది. తాను ప్రేమించి వ్యక్తితో ఎలాంటి ఆడంబరం లేకుండా సింపుల్‌గా గుడిలో తాళి కట్టించుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రియాంక తన కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. మలేషియాలోని మురుగన్ ఆలయంలో ప్రియాంక, రాహుల్ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.
ప్రియాంక పెళ్లి చేసుకున్న వ్యక్తి రాహుల్ వర్మ అనే ఓ వ్యాపారవేత్త అని తెలిసింది. ఇతడు కూడా తెలుగులో పలు సీరియళ్లో నటించాడని, అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలిసింది.
ప్రస్తుతం ప్రియాంక తమిళంలో సెటిలైంది. ‘సన్ టీవీ’లో ప్రసారమయ్యే ‘రోజా’ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. అలాగే జీ-తమిళ్లో ప్రసారమయ్యే ‘సీతారామన్’ సీరియల్లో కూడా నటిస్తోంది.
ప్రియాంక తెలుగులో బాలనటిగా పలు సీరియళ్లలో నటించింది. ఆ తర్వాత కూడా కొన్ని కీలక పాత్రల్లో నటిస్తూ గుర్తింపు పొందింది. అయితే, తమిళనాడులో వచ్చినంత పాపులారిటీ ఇక్కడ లభించలేదు. తెలుగులో ‘జబర్దస్త్’ గెటప్ శ్రీనుతో కలిసి ‘ఈటీవీ ప్లస్’లో ప్రసారమైన ‘సినిమా చూపిస్తా మామ’లో యాంకర్‌గా మెప్పించింది.
ప్రియాంక స్వస్థలం హైదరాబాద్. 2010లో విడుదలైన ‘అందరి బంధువయా’ మూవీలో నటిగా పరిచయమైంది. తమిళంలో ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘కాంచన-3’ సినిమాల్లో నటించింది.
ప్రియాంక నల్కరీ (Image Credit: Priyanka Nalkari/Instagram)
ప్రియాంక నల్కరీ (Image Credit: Priyanka Nalkari/Instagram)