సత్యభామ అక్టోబరు 07 ఎపిసోడ్ హైలెట్స్: క్రిష్ ని డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయిన సత్య - చక్రీ రాకతో మహదేవయ్యకి కౌంట్ డౌన్!
సత్యభామ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మహదేవయ్యకి క్రిష్ సొంత కొడుకు కాదని తెలియడంతో కథ కీలక మలుపు తిరిగింది. సత్యకి నిజం తెలిసినప్పటికీ భర్త క్రిష్ కి చెప్పలేని పరిస్థితి. అందుకే క్రిష్ కి వ్యక్తిగత జీవితంపై ఆసక్తి పెంచేలా చేసి గొడవలకు దూరంగా ఉంచేందుకు ప్లాన్ చేస్తోంది
ఫస్ట నైట్ వాయిదాలమీద వాయిదాలు పడడంతో..ఇక ముహూర్తంతో పనిలేదంటాడు క్రిష్. తనని డైవర్ట్ చేయడానికి ఇదే మంచి అవకాశం అని భావించిన సత్య.. ఫస్ట్ నైట్ జరగాలంటే తన బర్త్ డే ఎప్పుడో తెలుసుకోవాలంటూ తనకు చదువు చెప్పిన మాస్టారి దగ్గరకు పంపిస్తుంది.
ఇయర్ తెలుసుకుని వచ్చిన క్రిష్.. నెల మాత్రం తెలుసుకోడు..దీంతో మళ్లీ ఫజిల్ ఇస్తుంది. మరోవైపు ఇదే అవకాశంగా గొడవలకు దూరంగా ఉంచేందుకు ప్లాన్ చేస్తోంది. మహదేవయ్య గురించి నేరుగా చెప్పకుండా క్రిష్ రూట్లోనే వెళుతూ తనకి అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తోంది
సత్య-మహదేవయ్య సవాల్ మధ్యలో చక్రవర్తి రావడంతో కథ మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకూ సత్యకి ...క్రిష్ మహదేవయ్య కొడుకు కాదని మాత్రమే తెలుసు..కానీ చక్రవర్తి కొడుకు అని తెలియదు. ఆ విషయం తెలిస్తే లెక్కలు వేరుగా ఉంటాయ్
చక్రవర్తే క్రిష్ కి తండ్రి అని తెలియనప్పటికీ..తను చూపించే ఆప్యాయతను గుర్తించింది సత్య. తన అసలు తండ్రి అని..మహదేవయ్య కుట్ర చేశాడని బయటపడితే ప్రయత్నాలు మరింత జోరుపెరుగుతాయి
మరోవైపు సత్య-క్రిష్ ఒక్కటవ్వకూడదని మహదేవయ్య - రుద్ర చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టి భర్తకు దగ్గరకానుంది సత్య. ఓ వైపు ప్రేమగా క్రిష్ కి దగ్గరవుతూనే మరోవైపు తను ఆ అంటికి ఓ బలిపశువు అని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో చక్రవర్తి సహాయం చేస్తే కథ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగనుంది