Kriti Sanon: కృతి సనన్ నవరాత్రి లుక్... స్వర్గం నుంచి పరమ్ సుందరి దిగొచ్చినట్టు!
Kriti Sanon Instagram: బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తెలుగులో కూడా సినిమాలు చేసింది అయితే ఇప్పుడు హిందీ సినిమాల మీద ఫుల్ ఫోకస్ చేస్తోంది. అయితే ఆవిడను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే జనాలు చాలా మంది ఉన్నారు. వాళ్లకు నవరాత్రి ఫోటోలు కొత్తగా కనిపించాయి. (Image Courtesy: kritisanon / Instagram)
కథానాయికగా కృతి సనన్ సినిమాల్లో మోడ్రన్ రోల్స్ ఎక్కువ చేశారు. ప్రభాస్ 'ఆదిపురుష్', అక్షయ్ కుమార్ 'హౌస్ ఫుల్ 4' వంటి సినిమాలలో సీతగా, మహారాణిగా కనిపించిన క్యారెక్టర్లు ఉన్నప్పటికీ ఆవిడ రెగ్యులర్ స్టైల్ మోడరన్ మంత్ర. (Image Courtesy: kritisanon / Instagram)
ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులు వేసే కృతి సనన్ ఇప్పుడు నవరాత్రి సందర్భంగా చక్కగా చీరలో ముస్తాబయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: kritisanon / Instagram)
దేవి నవరాత్రుల సమయంలో చక్కగా చీర కట్టిన కృతి సనన్ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. పరం సుందరి స్వర్గం నుంచి భూమి మీదకు దిగి వచ్చిందా అన్నట్లు ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. (Image Courtesy: kritisanon / Instagram)
హీరోయిన్ల ఫోటో గ్యాలరీలతో పాటు రాజకీయ వార్తలు, సినిమా కథనాల కోసం ఏపీబీ దేశం ఫాలో అవ్వండి (Image Courtesy: kritisanon / Instagram)