Satyabhama Serial Today October 3rd: క్రిష్ కి మరో ఫజిల్ వదిలిన సత్య..చక్రవర్తి ఎంట్రీతో మహదేవయ్యలో మొదలైన టెన్షన్ - సత్యభామ సీరియల్ అక్టోబరు 03 ఎపిసోడ్ హైలెట్స్!!
మైత్రిని చూసేందుకు పెళ్లివారు వస్తారు..వచ్చినప్పటి నుంచి వంకలు పెడుతూ, వర్జ్యం, జాతకం, గ్రహాలు అంటూ హడావుడి చేస్తారు. వాళ్ల తీరు చూసి హర్ష మండిపడతాడు
ఇంటికి వచ్చిన చక్రవర్తిని చూసి మహదేవయ్య షాక్ అవుతాడు..ఎందుకొచ్చావ్ అని అడిగితే.. రావాల్సి వచ్చిందంటాడు. అయినా నువ్వెందుకు భయపడుతున్నావ్ అని అంటే.. భయం కాదంటాడు మహదేవయ్య..అది భయమే అని స్ట్రాంగ్ చెబుతాడు చక్రవర్తి...
ఇంతలో జయమ్మ వచ్చి చిన్న కొడుకుని చూసి సంతోషిస్తుంది. సత్య పిలిస్తే వచ్చానంటాడు చక్రవర్తి. మహదేవయ్య షాక్ అవుతాడు. నీవల్ల దూరమైన బంధాలు దగ్గరవుతున్నాయ్ అని జయమ్మ పొగుడుతుంది.
నేను ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుంచీ అంకుల్ ఇంటికి భోజనానికి రాలేదు..మాకు మాత్రం రిసార్ట్ లో మంచి విందు ఇచ్చారు..అందుకే ఇంటికి భోజనానికి పిలిచాను అంటుంది.
వాడు రాడు..వచ్చినా వెంటనే మాయమైపోతాడు..అందుకే ఉన్నంత సేపూ కళ్లారా చూద్దామనుకుంటున్నా అని జయమ్మ ఎమోషనల్ అవుతుంది. మరి నా పరిస్థితేంటి అని మనసులో బాధపడతాడు చక్రవర్తి.
మరోవైపు మహదేవయ్య టెన్షన్ పడుతుంటాడు..క్రిష్ ..చక్రవర్తి కొడుకే అని సత్యకు తెలసిపోయిందా ఏంటి అనుకుంటాడు
బాధపడుతున్న మైత్రిని హర్ష ఓదార్చుతాడు. తన పెళ్లి సంబంధాలు చూడొద్దు..ఇలా ఒంటరిగా ఉండిపోతాను అని ఏడుస్తుంది.
అందరూ కలసి భోజనం చేస్తుంటారు..మీవాళ్లంతా ఇక్కడే ఉంటే మీరు ఎందుకు అందరకీ దూరంగా ఉంటున్నారు ఎందుకు ఇక్కడికి రారు అని సత్య చక్రవర్తిని అడుగుతుంది. నాకు గొడవలు ఇష్టంలేదు అందుకే దూరంగా ఉంటున్నా అంటాడు.
క్రిష్ పుట్టినప్పుడు మీరు ఇక్కడలేరా అని సత్య అడిగితే.. అదే టైమ్ లో వీడికి కూడా బాబు పుట్టాడు అని జయమ్మ చెబుతుంది. బాబాయ్ కొడుకు ఫారెన్ లో ఉంటున్నాడని క్రిష్ చెబుతాడు..
పూలు మంచంపై చల్లుతున్న క్రిష్ తో..మరి నా బర్త్ డే ఎప్పుడో తెలుసుకున్నారా అని అడుగుతుంది. తెలుసుకున్నా అంటూ తెలుగు మాస్టారు చెప్పిన ఇయర్ చెబుతాడు..మరి డేట్ సంగతేంటి అంటూ మరో ఫజిల్ ఇస్తుంది..అబ్బా అని క్రిష్ తలపట్టుకుంటాడు....