Satyabhama Today October 23rd Episode Highlights: యుద్ధానికి బయలుదేరిన సత్యభామ.. మైత్రి పైశాచికత్వం చూసి నందిని షాక్ - సత్యభామ అక్టోబరు 23 ఎపిసోడ్ హైలెట్స్ !
తన కొడుకుని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావ్ అని చక్రవర్తిని నిలదీస్తాడు మహదేవయ్య..నీ కొడుకుని నీ ఇంట్లో వదిలేసి నా కొడుకుని తీసుకెళ్లేందుకు వచ్చాను అంటాడు. అది ఎప్పటికీ జరగదు అని సవాల్ చేస్తాడు మహదేవయ్య
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాకు ఆ శక్తి లేకపోవచ్చు..ఓ శక్తిని అడ్డుపెట్టుకుని ఇదంతా చేస్తానంటూ సత్యను చూపిస్తాడు. అది శక్తి కాదు నాకు గడ్డిపరకతో సమానం అంటాడు. ఆ శక్తికి భయపడే నీ కొడుకుని జైలుకి పంపించింది.. నీ గుండెపై పచ్చబొట్టు పొడిపించుకునేలా చేసిందంటాడు.
నిజం చెప్పేస్తావా అంటే..నిజాన్ని దాచిపెట్టి నాకు కావాల్సింది సాధించుకుంటా..ఆ సంగతి నా కోడలు చూసుకుంటుందని చెప్పి చక్రవర్తి వెళ్లిపోతాడు..మహదేవయ్య ఆవేశంతో రగిలిపోతాడు
సంజయ్..సత్యకోసం వెతుకుతూ ఉంటాడు. బయట సాంగ్ పెట్టుకుని బట్టలు ఆరేస్తూ స్టెప్పులేస్తన్న సత్యను చూసి అలాగే ఉండిపోతాడు. గులాబీ తీసుకెళ్లి ఏవేవో మాట్లాడుతుంటాడు. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు అని చెప్పి వెళ్లిపోతుంది. అసలు నువ్వు చక్రవర్తి కొడుకువేనా అంటుంది.
బాల్కనీలో ఉన్న సత్యను వెనుకనుంచి క్రిష్ టచ్ చేస్తే ఏయ్ అని అరుస్తుంది సత్య. ఏమైందని అడిగితే సంజయ్ ఇక్కడ ఎన్నిరోజులు ఉంటాడు అని అడుగుతుంది. పెళ్లి చేస్తానని బాబాయ్ కి మాటిచ్చాకదా అంటాడు క్రిష్. నన్ను ద్వేషించి దగ్గరయ్యావు ఇప్పుడు వాడిని ద్వేషిస్తున్నావ్.. అలవాటు అవుతుందిలే అంటాడు.
అందరూ భోజనానికి కూర్చుంటే సంజయ్ రాడు. ఆ కారం నేను తినలేనంటూ పిజ్జాలు ఆర్డర్ పెట్టుకుని తిన్నాడు అంటుంది జయమ్మ. ఇంతలో క్రిష్ వచ్చి..ఆ రోజులు పోయాయ్..సత్య వంట సూపర్ గా వంటచేస్తుంది..నాకు పొట్టరావడానికి రీజన్ ఇదే అంటాడు. అవునా అంటూ వచ్చి సంజయ్ భోజనానికి వస్తాడు
సత్య తులసికోట దగ్గర పూజ చేస్తుంటే అప్పుడే వచ్చిన సంజయ్ ఎవ్వరూ చూడకుండా ఫొటోలు తీస్తుంటాడు..అది సత్య చూసేస్తుంది..
సత్యభామ అక్టోబరు 24 ఎపిసోడ్ లో మైత్రిలో పైశాచికత్వం పెరిగిపోయినట్టు చూపించారు. నందిని-హర్ష ఫొటో చూసి పగలకొట్టేసి పొరపాటున చేయిజారిందని చెబుతుంది. మరోవైపు నర్సింహం కన్నా ముందే వెళ్లి అధిష్టానాన్ని కలవాలి..మనకు సీటు రాకపోతే నర్సింహాన్ని చంపేయాలి అంటాడు మహదేవయ్య. సత్యకు అదే విషయం చెబితే తాను కూడా వస్తానంటుంది.. క్రిష్ ఆలోచనలో పడతాడు..