Satyabhama Today October 22nd Episode Highlights: సత్యపై కన్నేసిన సంజయ్..రుద్రను మించి అరాచకంగా ఉన్నాడుగా
రుద్రని కలిసిన భైరవి...విడిపిస్తానని మాటిస్తుంది. తాను ఇంటికి వచ్చేసరికి సత్య ఇంట్లోంచి పోవాలి లేదంటే చంపేస్తానంటాడు రుద్ర. సరే అని వెళ్లిపోతుంది భైరవి..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసత్య..మహదేవయ్యకి కాఫీ తీసుకెళితే కొడుకు క్రిష్ కి ఇమ్మంటాడు. నా పేరు నీ గుండెలపై పచ్చబొట్టు వేసుకున్నావ్ రుణం తీర్చుకోలేను బాపు అని క్రిష్ అంటే.. ఈ ప్రేమ ఇలాగే ఉండాలిలా అని డైలాగ్స్ కొడతాడు.. తన రాజకీయ భవిష్యత్ కి అడ్డొచ్చిన నర్సింహని చంపేయమంటాడు. ఈ రాత్రికే జరిగిపోవాలని మహదేవయ్య అంటే ఇలాంటి విషయాల్లో ఆవేశం తగదని సత్య చెప్పింది బాపు అంటాడు.
సత్యకి రాజకీయం తెలియదురా అంటే..గెలవడం తెలుసు అంటాడు. అంటే నా అనుభవానికి విలువలేదా అంటే.. బాపు మిమ్మల్ని అందరూ అభిమానిస్తున్నా లోపల భయపడుతున్నారు.. కట్టుకున్న భార్యని చంపాలని మీ పెద్దకొడుకు ప్రయత్నించాడు ఇలాంటి టైమ్ లో నర్సింహని చంపేస్తే మనకు మాయని మచ్చ అవుతుంది
క్రిష్ వెళ్లిపోయిన తర్వాత క్లాప్స్ కొడుతూ ఎంట్రీ ఇచ్చిన సత్య.. ఇప్పటికైనా అర్థమైందా చిన్నా మీ చేతుల్లో ఆయుధం కాదు అని.. పచ్చబొట్టు వేయించుకున్నప్పటికీ మీ దొంగ ప్రేమ బయటపడుతుంది అంటుంది.
మైత్రి...హర్ష కోసం డైరీ రాస్తుండగా ఫోన్ వస్తే బయటకు వెళుతుంది..ఇంతలో హర్ష వచ్చి డైరీ చూడబోతుంటే వచ్చి లాగేసుకుంటుంది. లోన్ తీసుకున్నాని చెబుతాడు. నాకోసం ఎందుకు అంటే.. దోస్తుకదా ఎంచక్కా వెళ్లి చదువుకో అంటుంది నందిని. నన్ను పంపించేందుకు కుట్రలు చేసినా హర్షను విడిచిపెట్టను అనుకుంటుంది
image 6
మరోవైపు చక్రవర్తి..తన కొడుకుగా పెరుగుతున్న మహదేవయ్య కొడుకు సంజయ్ ని తీసుకొస్తాడు. చదువు అయిపోయింది జాబ్ వచ్చేసింది..పెళ్లి అంటే వద్దంటున్నాడు అందుకే అన్నయ్య దగ్గర వదిలేసేందుకు వచ్చాను అప్పుడైనా మారుతాడని అంటాడు చక్రవర్తి.
క్రిష్ ను చూసి పొట్ట వస్తోంది బ్రో పెళ్లైందా అంటాడు.. ఇంతలో సత్య రావడం చూసి అలానే చూస్తుండిపోతాడు
సత్య ..నా భార్య అని క్రిష్ పరిచయం చేస్తాడు. వదిన అని పిలువు అంటే..నేను-క్రిష్ కొన్ని నిముషాల తేడాతో పుట్టాం సత్య అనే పిలుస్తా అంటాడు. సత్యకోసం అదే ఇంట్లో ఉండిపోవాలి అనుకుంటాడు సంజయ్.
సత్య పూజ చేస్తుంటే చాటుగా ఫొటోస్ తీస్తుంటాడు సంజయ్..సత్య గమనించి క్లాస్ వేస్తుంది..ఇంతలో క్రిష్ వచ్చి సంజయ్ ఫోన్ తీసుకుని చూసి షాక్ అవుతాడు...