Satyabhama Today October 19th Episode Highlights: సత్య ప్లాన్స్ కి పచ్చబొట్టుతో చెక్ పెట్టేసిన మహదేవయ్య ...క్రిష్ క్లీన్ బౌల్డ్ - సత్యభామ అక్టోబరు 19 ఎపిసోడ్ హైలెట్స్!!
దసరా ఉత్సవాల్లో భాగంగా రావణుడికి బాణం వేసిన సత్య-క్రిష్... కొద్దిసేపటి తర్వాత రేణుక ఆ బొమ్మకు కట్టేసి ఉండడం గమనిస్తారు. సత్య చెప్పడంతో అటు చూసిన క్రిష్..రేణుకను కాపాడతాడు.
తాను దొరికిపోతానని భయపడిన రుద్ర..రేణుకను అక్కడినుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. మహదేవయ్య కూడా రుద్రకి సపోర్ట్ చేస్తాడు. అప్పుడు ఆపిన క్రిష్..వదినని ఎవరు కట్టేశారో తనకు తెలియాలి అంటాడు.. రుద్ర పురమాయించిన పనోడిని పట్టుకుని చితక్కొట్టగానే రుద్ర పేరు చెప్పేస్తాడు
అప్పటికి కూడా భైరవి..రుద్రని సపోర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ వాడు నిజమే చెప్పాడంటాడు క్రిష్..లోపలకు వెళ్లి మాట్లాడుకుందాం అని మహదేవయ్య అంటే..బాపూ...అన్న వదినను చంపబోయాడని క్లాస్ వేస్తాడు. వదినను తోసేశాడు, గర్భం పోయేందుకు గోలీలు తినిపించాడు ఈ రోజు చంపేయాలి అనుకున్నాడు..ఇంకా వాడిని నమ్ముతున్నారా?
మహదేవయ్య గుండెపై చిన్నా అని పచ్చబొట్టు పొడిపించుకుంటాడు... ఇదిక్కడ ఉంటే నువ్వు నా గుండెలపై ఉన్నట్టేరా అనగానే క్రిష్ తండ్రి ప్రేమకు ఫిదా అయిపోతాడు.. సత్య చూస్తుండిపోతుంది...
భైరవి సత్యకి శాపనార్థాలు పెడుతుంది..అన్నను ఎవరు విడిపించొద్దని వార్నింగ్ ఇస్తాడు క్రిష్. ఆ తర్వాత మహదేవయ్య - సత్య మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. క్రిష్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు..మీకొడుకు న్యాయంవైపు నిలబడే వ్యక్తి అంటుంది సత్య. ఈ మహదేవయ్య అంటే ఏంటో చూపిస్తా అని మీసం తిప్పుతాడు
రేణుగ బాధపడుతుంటే..క్రిష్-సత్య అక్కడకు వెళతారు. రేణుకకి సత్య క్షమాపణలు చెబుతుంది. కడుపులో బిడ్డ పోయాడు, భర్త జైలుకి పోయాడు ఇంకా దేనికి బతకాలని కన్నీళ్లు పెట్టుకుంటుంది రేణుక. అన్న మారి వస్తాడు వదినా అని క్రిష్ చెబుతాడు.. ముగ్గురి మాటలు భైరవి వింటుంది..