Satyabhama Today October 16th Episode Highlights: మహదేవయ్యకి షాక్ ఇచ్చిన క్రిష్ - రావణదహనంలో కాలిపోతున్న రేణుకని సత్య కాపాడగలదా!
ఇంట్లో ఆయుధాలన్నీ మహదేవయ్యతోనే పోలీసులకు ఇప్పించేస్తుంది సత్య. భైరవి క్లాస్ వేస్తుంది..క్రిష్ మాత్రం సత్యని సపోర్ట్ చేస్తాడు. సత్య చేసింది కరెక్ట్..బాపూ పేరు మారుమోగిపోతుంది..ఇక MLA గా గెలుపు తథ్యం అంటాడు క్రిష్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇలాంటి రోజుకోసమే నేను ఎదురుచూస్తున్నాను..సత్య మంచిపని చేసింది అంటుంది జయమ్మ. చదువుకున్నోళ్లకి చదువులేనివాళ్లకి తేడా ఇదే బామ్మా అంటాడు క్రిష్. సత్య చేసిన పని మంచిదా కాదా మాట్లాడు బాపూ అంటాడు క్రిష్.. చేసేది లేత నీ భార్య మంచిపనే చేసింది అంటాడు మహదేవయ్య..
ఈ గొడవలు ఆపేసి నందినిని పిలవమంటుంది జయమ్మ...నేను పిలవను అంటుంది భైరవి. నీకు కూతురు అవసరం లేకపోయినా నాకు చెల్లెలు కావాలి నేను పిలుస్తా అంటాడు క్రిష్.
నందిని హర్ష బట్టలు సర్దుతూ పాత సామాన్ల వాడు పాత బట్టలు అడిగాడు ఇవ్వడానికి తీస్తున్నా అంటుంది. సరే అన్న క్రిష్.. ఇంతలో నందిని చీర విషయంలో పొరపాటు పడిన విషయం గుర్తొచ్చి అమ్మో నా బట్టలు ఎవ్వరికీ ఇవ్వొద్దు అంటాడు.
ఇంతలో క్రిష్ కాల్ చేస్తాడు..క్రిష్ పై అరుస్తుంది నందిని. నీతో పోట్లాడి చాలారోజులైంది అంటాడు క్రిష్. నందిని రాను అంటే ...క్రిష్ బతిమలాడుతాడు. సరే నీకోసం వస్తానులే అంటుంది.
మహదేవయ్య ఆలోచిస్తుంటే..స్వీట్స్ తీసుకొచ్చి ఇస్తుంది సత్య. మహదేవయ్య అంటే మహావృక్షం..అదో గెలుపు అని పొంగిపోతున్నావా నేను ఆయుధాలు అమెరికా నుంచి తీసుకురాలేదు..లోకల్ నుంచే తెప్పించా.. తెల్లారేసరికి వాటికి డబుల్ తెప్పిస్తానంటాడు
నా కొడుకుని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు తెలుసు అని మహదేవయ్య అంటే..అది అంత తేలికాదు కాబోయే ఎమ్మెల్యే గారు అని ఝలక్ ఇస్తుంది.
రేణుక మాటలకు రగిలిపోయిన రుద్ర..నేను మెగుడిని అని మర్చిపోవాయా నోరు లేస్తోందని ఫైర్ అవుతాడు. నువ్వు పెట్టే ప్రతి ఇబ్బందిని తట్టుకుని బతుకుతున్నా..జీవితంలో తల్లి అనే పిలుపు దూరం చేశావ్..ఇకపై నువ్వు గిల్లితే నేను రక్కుతా అని రివర్సవుతుంది. రేణుకను చంపేయాలని డిసైడ్ అవుతాడు రుద్ర.. ఆ మాటలు సత్య వినేసి రుద్రకి వార్నింగ్ ఇస్తుంది.
మరోవైపు గుమ్మానికి పూలు కడుతూ పడిపోయినట్టు క్రిష్ యాక్ట్ చేస్తే సత్య వచ్చి పట్టుకుంటుంది...
సత్యభామ అక్టోబరు 17 ఎపిసోడ్ లో.. రావణదహనం కోసం సిద్ధం చేసిన రావణుడి బొమ్మ వెనుక రేణుకను కట్టేస్తాడు రుద్ర.. అలాగే బాణం వేసేస్తాడు.. ఆ మంటల్లో కాలిపోతుంటుంది రేణుక.. సత్య చూసి కాపాడుతుందా?