Satyabhama Serial February 27th Episode Highlights: తిరిగి మహదేవయ్య ఇంటికి క్రిష్..కండిషన్స్ అప్లై అన్న భైరవి - సత్యభామ ఫిబ్రవరి 27 ఎపిసోడ్ హైలెట్స్!
నాన్నా అని పిలవలేకపోతున్నా అని బాధపడతాడు క్రిష్. బాబాయ్ అని పిలువు..నాలో నాన్న కనిపించేనప్పుడే పిలువు అంటాడు. తండ్రిని హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు క్రిష్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసంధ్యని చూసి సంజయ్..దీని మనసులో ఏదో మెదులుతోంది ఇప్పుడు వెళ్లకూడదు అనుకుంటాడు..ఇంతలో సంజయ్ అని పిలుస్తుంది. నీకు అనుమానం ఉందా అని అడిగితే అస్సలు లేదు అంటుంది. మీ అక్క ఇక్కడ లేనప్పుడు నీతో నాకేం పని..త్వరలోనే నిన్ను గెంటేస్తా అనుకుంటాడు సంజయ్. ఇకపై ఇంట్లో కోడలిగా చక్రం తిప్పుతా అంటుంది సంధ్య..ఓసి పిచ్చిదానా అని నవ్వుకుంటాడు
తనను కాదనుకున్న వాళ్లపై ఎందుకంత ప్రేమ అంటుంది సత్య. వాడు ఎవరి విషయంలో అయినా ఒకేలా ఉంటాడు. ఒక్కసారి బంధం అనుకుంటే వదిలిపెట్టలేడు..బయటకురాలేడు అంటాడు.నా కొడుకు ఎప్పటికీ ఈ ఇంటికి రాడు అనుకున్నా వచ్చాడు.. నిజం తెలిసాక నాన్నా అంటాడు అనుకున్నా కానీ అనుకున్నది జరగకపోవడమే జీవితం అని బాధపడతాడు.
చిన్నాకు వాళ్లమ్మ హత్యకు సంబంధించిన నిజం ఎందుకు చెప్పనివ్వలేదని అడుగుతాడు..ఇప్పటికే ఓ బాధ నుంచి బయటపడడంలేదు.. ఇప్పుడు మరో నిజం తెసిస్తే తేరుకోలేడు అంటుంది సత్య. ఇంటి బాధ్యత తీసుకో అని తాళాలు ఇస్తాడు.
మహదేవయ్య గదిలో ఉంటే పనోడు వచ్చి రేపు హైదరాబాద్ వెళ్లాలంటాడు.. ఆ ఏర్పాట్లు చిన్నాగాడిని చూసుకోమను అని అలవాటులో అంటాడు. వాడు లేడు ఇకపై మేం చూసుకుంటాం అంటూ ఎంట్రీ ఇస్తారు రుద్ర, సంజయ్.
అయ్యగారి మందులు నుంచి అన్నీ క్రిష్ బాబు చూసుకునేవారు అంటాడు పనోడు. ఇన్నాళ్లూ నన్ను కంటికిరెప్పలా చూసుకునేవాడిని మర్చిపోమంటే ఎలా అనుకుంటాడు మహదేవయ్య
నందిని బాధగా రేణుకకు కాల్ చేసి జరిగినదంతా చెబుతుంది. అంతా కలసి ఒక్కసారిగా చిన్నాని అనాథని చేశారు..నాకు ఈ ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదంటుంది.
ఏం జరిగిందని అత్త విశాలాక్షి అంటే..ఏడుస్తుంది నందిని. ఇంతలో హర్ష వచ్చి మైత్రి విషయం తెలిసిపోయిందేమో అనుకుంటాడు. జరిగిన విషయం మొత్తం చెబుతుంది. పాతికేళ్లుగా ఇంత మోసం చేస్తారా అని విశ్వనాథం బాధపడతాడు
ఆ ఇంటిలో అందరి కన్నా నన్ను ప్రేమగా చూసుకునేది చిన్నన్నే... ఇక నేను ఆ ఇంటికి శాశ్వతంగా వెళ్లను అంటుంది. నేను సొంత చెల్లిని కాదని నాకు కాల్ కూడా చేయలేదంటుంది. ఇలాంటి టైమ్ లో మనం వాళ్లకి సపోర్ట్ గా ఉండాలంటాడు హర్ష
ఎందుకు సంధ్యా రమ్మన్నావ్ ఈ అక్కని చూడాలని అనిపించిందా అంటుంది సత్య. అంత లేదు .. ఓడలు బళ్లు బళ్లు ఓడలు అయితే ఎలా ఉంటుందో అర్థమైందా అని అడుగేందుకు రమ్మన్నా అంటుంది. మహదేవయ్య కోడలిని నేను అని పొగరుగా మాట్లాడుతుంది.
మంచికి మారు పేరు అయిన క్రిష్‌కి భార్యగా ఉండటానికి క్యారెక్టర్ లేని సంజయ్‌కి భార్యగా ఉండటానికి ఉన్నంత తేడా ఉందని సత్య స్ట్రాంగ్ ఇస్తుంది. నన్ను ఎదగకుండా అడ్డుకున్న నువ్వు ఎంత కూరికుపోయావో చూడు అంటుంది. సత్య నిజం చెప్పినా సంధ్య వినదు.
సత్యభామ ఫిబ్రవరి 28 ఎపిసోడ్ లో...క్రిష్ తాగుతూ తూలుతూ ఉంటాడు. ఏదో ఓ రోజు బాపు నాకోసం వస్తాడు, నన్ను చూడకుండా ఉండలేడు అంటాడు. మహదేవయ్య ఇంటికి వెళ్లిన సత్య...క్రిష్ ని ఇదివరకట్లా ప్రేమగా పిలవండి అంటుంది. అలా జరగాలంటే నువ్వు తన జీవితంలోంచి వెళ్లిపోవాలనే కండిషన్ పెడుతుంది భైరవి...