Satyabhama Serial February 25th Episode Highlights: కొడుకువి కాదు కుక్కవి అన్న మహదేవయ్య.. లెక్కలు సెట్ చేసే సమయం వచ్చిందన్న సత్య- సత్యభామ ఫిబ్రవరి 25 ఎపిసోడ్ హైలెట్స్!

నిజం చెప్పి నువ్వు సంతోషంగా ఉన్నావ్ నేను జీవితాంతం ఎలా భరించాలి అంటాడు క్రిష్. నా పేరు పచ్చబొట్టు ఎందుకు పొడిపించుకున్నావ్ అంటాడు. దాన్ని కత్తితో చెరిపేసిన మహదేవయ్య..నిన్ను కొడుకులెక్క ప్రేమగా పెంచుకోలేదు..కుక్క లెక్క నా కాళ్లకింద పెట్టుకుని పెంచాను అంటాడు
Download ABP Live App and Watch All Latest Videos
View In App
నీ పెళ్లాం వచ్చిన తర్వాత మారిపోయావ్..నా మాట లెక్కచేయడం లేదు. నీ పెళ్లాంపై మోజుతో MLA గా పోటీ చేయిస్తున్నావ్. అది నిర్ణయం వెనక్కు తీసుకోవాలి అనుకుంటే రెచ్చగొట్టి చేసింది నువ్వేకదా అంటాడు మహదేవయ్య.

నువ్వంటే ప్రాణం అని చెప్పి ఇదేనా నువ్వు చేసింది గుంటనక్క అని తోసేస్తాడు. నీ పెళ్లాంతో కుమ్మక్కై నా కన్నకొడుకుని చంపుతుంటే ఎలా ఊరుకుంటా అనుకుంటా..అద్దె కొడుకుకోసం కన్న కొడుకుని బలిపెట్టుకుంటానా అంటాడు. మనిద్దరికి లెక్కలు సెటిలైపోయాయ్ నీ అవసరం నాకు లేదు నడువు అంటాడు
రేయ్..నీ అంత నువ్వు పోతావా మెడపట్టుకుని బయటకు గెంటాలా చెప్పు అంటాడు మహదేవయ్య. రేయ్ చిన్నకొడుకా షాక్ తో మైండ్ బ్లాక్ అయింది నువ్వు మీ అన్నా కలసి వాడిని మోసుకుపోయి బయటకు పడేయండ్రా అంటాడు.
క్రిష్ పై చేయి వేసేందుకు వెళుతున్న సంజయ్, రుద్రని సత్య బెదిరిస్తుంది. ఎవరి మీద చేయవేస్తున్నారో తెలుసా ... మీరే దైవం అనుకుని జీవితాంతం మీకు ఊడిగం చేసి మంచి మనిషి గురించి..కింద పడ్డ వస్తువుని అందించిన ముక్కు మొహం తెలియని మనిషికి థ్యాంక్స్ చెబుతాం కనీసం కృతజ్ఞత లేని మీవి ఏం బతుకులు
సత్యా అని రుద్ర అనగానే.. అరిస్తే భయపడను నీకన్నా గట్టిగా అరుస్తా ..క్రిష్ ప్లేస్ లో వెరొకరు ఉండి ఉంటే మీరు చేసిన ద్రోహానికి గుండెలపై ఎగిరితన్నేవారు.. ఈ పాటికి రక్తపుమడుగులో ఉండేవారు. ఇప్పటికీ మిమ్మల్ని గుండెల్లో మోస్తున్నాడు కాబట్టే గుండెపగిలేలా బాధపడుతున్నాడు
నా కన్నా మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు తెలుసా..ఇద్దరు కొడుకుల్ని పక్కనపెట్టుకుని రొమ్ము విరుచుకుంటున్నావ్...మీరు సాధించింది ఏం లేదు. క్రిష్ పోగొట్టుకున్నది ఏం లేదు. మనసున్న తండ్రికి దగ్గర కాబోతున్నాడు..ఇకపై మిమల్ని మీ కొడుకుల్ని మీరే కాపాడుకోండి.
ఈ ఇంట్లో అబద్ధాలు మోసాలే కదా అని అంటే..హద్దుల్లో ఉండు అంటాడు రుద్ర. ఈ ఇంటిపై నోరు పారేసుకోకు అంటుంది భైరవి. భర్త మీద ప్రేమ సరే..పాతికేళ్ల కొడుకు అని పెంచిన చిన్న మీద ప్రేమ ఏమైందని అడుగుతుంది. రేయ్ ఇది నీ ఇల్లు కాదు నట్టింట్లో కూర్చుని ఏడవడానికి పోరా అని మెడపట్టుకుని గెంటేస్తాడు మహదేవయ్య..చక్రవర్తి పట్టుకుంటాడు. జరిగినదంతా చెప్పి బాధపడుతుంది సత్య.
మహదేవయ్య-చక్రవర్తి ఇద్దరూ ఒకరి కాలర్ పట్టుకుంటారు. సారీ చెప్పు క్రిష్ అంటే చెప్పను ఏం చేసుకుంటావో చేసుకో అంటాడు మహదేవయ్య. వాడి కొడుకుని చదివించి చేతిలో పెట్టాను..కానీ కొడుకుని మెడపట్టి గెంటాడని బాధపడతాడు.
ఈ లెక్కలు సరిచేసేది క్రిష్ మాత్రమే అంటుంది సత్య. సమయం వస్తుంది చూస్తుండండి అంటుంది
సత్యభామ ఫిబ్రవరి 26 ఎపిసోడ్ లో... జీవితాంతం అందర్నీ బెదిరిస్తూ భయపెడుతూ బతికేస్తావా.. చిన్నాగాడి కన్నీళ్ల ఉసురు నీకు తగిలి తీరుతుంది అంటుంది మహదేవయ్య తల్లి... మరోవైపు నాన్నా అని నిన్ను పిలవలేకపోతున్నా అంటాడు క్రిష్. బాబాయ్ అని పిలువు అంటాడు చక్రవర్తి..