క్రిష్ ముందు సత్యని దోషిగా నిలబెట్టిన మహదేవయ్య .. మైత్రి మరో కుట్ర - సత్యభామ అక్టోబరు 30 ఎపిసోడ్ హైలెట్స్!
క్రిష్ తాగి ఉండడంతో సత్య కారు డ్రైవ్ చేస్తుంది. ఈ రోజుంతా చాలా సంతోషంగా ఉన్నాను థ్యాంక్స్ అంటాడు. ఇన్నాళ్లూ మహదేవయ్య కొడుకుగా బతికాను..ఈ రోజు సత్యభామ భర్తగా బతికాను అంటాడు. రెండింటిలో ఏదినీకు ఆనందం అంటే... మహదేవయ్య లేకపోతే ఈ జన్మలేదు - సత్యభామ లేకపోతే జీవితమే లేదంటాడు
నువ్వే నా జిందగీ అని క్రిష్ అనడంతో.. మీ బాపు- నేను ఇద్దరిలో ఒకర్నే కాపాడాల్సి వస్తే ఎవర్ని కాపాడతావు అంటుంది సత్య. రేపు ఉదయం చెబుతాను అంటాడు. లోపలకు వెళ్లేసరికి మహదేవ్య తలకు కట్టుతో ఉంటాడు. భైరవి,రేణుక, జయమ్మ అక్కడ కూర్చుని ఉంటారు .
బాపుపై ఎవరో అటాక్ చేశారు..నీకు నీ పెండ్లామే ముఖ్యమైందని భైరవరి విరుచుకుపడుతుంది. వెంటనే క్రిష్ మహదేవయ్య కాళ్ల దగ్గర కూర్చుని ఇదంతా నావల్లే జరిగింది ఇంకెప్పుడూ నిన్ను వదిలివెళ్లను అని ఏడుస్తాడు.
క్రిష్ లోపలకు వెళ్లిపోగానే..మహదేవయ్య తలకు ఉన్న కట్టు తీసేస్తాడు..నీ భర్తను నా కంట్రోల్ లో ఉంచుకోవాలంటే ఈ మాత్రం చేయాలి అంటాడు. సత్య షాక్ అవుతుంది.
నందిని వాళ్లు ఇంటికి చేరుకుంటారు. సత్య బావ వచ్చారని హర్ష ఇంట్లో చెబుతాడు. మైత్రి వీసా పని పూర్తైందని..తనని త్వరలోనే ఫారెన్ పంపేస్తా అంటుంది నందిని. వెళ్లకుండా ఉండేందుకు ఏదో ప్లాన్ చేస్తుంది మైత్రి. ప్లాన్ రివర్సైతే హర్ష నీకు దూరమవుతాడని స్నేహితురాలు హెచ్చరిస్తుంది.
మహదేవయ్యకు నిజంగానే దెబ్బతగిలిందని క్రిష్ తెగబాధపడుతుంటాడు. సత్య ఎంత చెప్పినా కానీ వినడు.. క్రిష్ ని ఓదార్చేందుకు ప్రయత్నిస్తుంది కానీ నార్మల్ అవడు. ఈ రోజు ఎపిసోడ్ పూర్తైంది...
సత్యభామ అక్టోబరు 31 ఎపిసోడ్ లో... అసలు మహదేవయ్యకి దెబ్బ తగల్లేదని చెబుతుంది సత్య. ఆయింట్మెంట్ రాసేందుకు వెళతాడు క్రిష్.. మహదేవయ్య షాక్ అయి సత్యని చూస్తాడు...