Satyabhama Serial Today November 8th Highlights : సత్యపై పగతో రగిలిపోతున్న భైరవి.. నందిని ఆనందాన్ని ఆవిరి చేసిన మైత్రి - సత్యభామ నవంబరు 08 ఎపిసోడ్ హైలెట్స్!
సత్యకి కరెంట్ షాక్ కొట్టించాలని భైరవి ప్లాన్ చేస్తుంది. సత్య వెళ్లి స్విచ్చాన్ చేసే టైమ్ కి కరెంట్ పోతుంది. ఇంట్లో ఓ రూమ్ లో కరెంట్ ఉండి మరో రూమ్ లో లేకపోవడం చూసి క్రిష్ ఫ్యూజ్ సెట్ చేస్తాడు..సరిగ్గా అదే టైమ్ కి భైరవి స్విచ్ వేయడంతో తాను తీసిన గోతిలో తానే పడుతుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాకు ఏం కాలేదు మీకెందుకు షాక్ కొట్టిందని సత్య అడుగుతుంది.. షాక్ గట్టిగానే తగిలినట్టుంది డాక్టర్ ని పిలిస్తే బెటర్ అంటుంది రేణుక. ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా అని సత్య అంటే..ఆఖరి కోరిక అడిగినట్టు అడుగుతున్నావేంటి అంటుంది జయమ్మ..
సత్యభామ నవంబరు 09 ఎపిసోడ్ లో... హర్ష ఇంత కష్టపడిన తర్వాత కూడా మైత్రి ఫారెన్ వెళ్లకుండా ఎలా స్కిప్ కొట్టిందో తెలుస్తుంది..
విశ్వనాథం దగ్గరకు వచ్చిన విశాలాక్షి వచ్చి ఈ మధ్య హర్ష నాతో ఎక్కువ మాట్లాడటం లేదు ఎందుకలా ఉన్నాడో అడుగు అంటుంది. ఇంతలో పోస్ట్ వస్తుంది. మైత్రికి వీసా వచ్చేసిందని, డబ్బు కూడా రెడీ చేశానని హర్ష చెబుతాడు.
మిమ్మల్ని వదిలి వెళ్లాలంటే బాధగా ఉందని మైత్రి అంటే.. నేను పుట్టింటిని వదిలి వచ్చాను కదా నీక్కూడా అలవాటు అయిపోతుందిలే అంటుంది నందిని . నాకు వెళ్లాలని లేదని మైత్రి అంటే..చదువుకన్నా ఇంకేం ముఖ్యంకాదు వెళుతుందిలే అంటాడు హర్ష.
భైరవిని చెక్ చేసిన డాక్టర్ రెస్ట్ తీసుకోమంటుంది...రోజంతా లిక్విడ్స్ తీసుకోమని చెబుతుంది. బైరవిని ఏడిపించేందుకు జయమ్మ కావాలనే తనకు బిర్యాని తెమ్మని చెప్పి అక్కడే కూర్చుని తింటుంది. అత్తయ్య మీక్కూడా కొద్దిగా తీసుకురానా అని సత్య కూడా ఆటపట్టిస్తుంది
అమ్మ నగలు ఇవ్వలేదు కదా మరి మైత్రి ప్రయాణానికి డబ్బులు ఎలా సెట్టయ్యాయని విశ్వనాథం అడుగుతాడు. డబ్బు ఎలా సెట్ అయిందో చెప్పే ధైర్యం లేదు అందుకే చెప్పలేదంటూ లోన్ తీసుకున్న విషయం చెబుతాడు హర్ష..