Satyabhama Serial Today November 29th Highlights : సత్య ప్రయత్నం వృధాయేనా .. మహదేవయ్య ఇవ్వబోయే షాక్ ఏంటి - సత్యభామ నవంబరు 29 ఎపిసోడ్ హైలెట్స్!
గంగ రూమ్ కి వెళ్లిన సత్యతో.. తాను వెళ్లపోతున్నా DNA టెస్ట్ కి సిద్ధంగా లేనంటుంది. జీవితాంతం ఈ చెర నుంచి క్రిష్ ని విడిపించుకోలేను, నువ్వు చేస్తున్నది మామూలు సహాయం కాదు..జీవితాంతం నీకు రుణపడి ఉంటానని జరిగినదంతా చెబుతుంది. గంగ సరే అంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆయన రెండో భార్యగా ఉండిపోమని అంటాడేమో మా ఆయన ఒప్పుకోడని చెప్పు అని నవ్వుతుంది. నువ్వు నా మనిషివి అని మావయ్యకి నేను చెప్పేశాను..ఇకపై నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి. టెస్ట్ రిపోర్ట్ వచ్చేవరకూ మావయ్యకి ప్రతి నిముషం టార్చర్ చేయాలంటుంది. పట్టుబిగించి ఉండాలి గంగ అని చెబుతుంది
ఎక్సరసైజ్ చేస్తున్న క్రిష్ దగ్గరకు వెళ్లిన భైరవి..నట్టింట్లో కూర్చున్న దాన్ని ఎలాగోలా బయటకు పంపరా అంటుంది. బాపుని చెప్పమను చాలు అంటాడు క్రిష్.. ఇంతలో నా గురించేనా అంటూ భైరవి పాలు తీసుకొచ్చి బాగా అలసిపోయావు ఇదిగో అంటూ పాలగ్లాసు ఇస్తుంది. మీ పెద్దమ్మ ఏమైనా అనుకుంటుందని మొహమాటపడుతున్నావా అని భైరవిని ఆడుకుంటుంది.
ఇంతలో సత్య పూలు తీసుకొచ్చి అత్తయ్యా మీకోసమే అంటుంది..భైరవి తీసుకునేలోగా గంగ రెండు ముక్కలు చేసి ఇద్దరికి సగం సగం అంటుంది. ఈ పూట నుంచి సర్దుకోవడం నేర్చుకుందాం అంటుంది.
ఇంతలో ఎంట్రీ ఇచ్చిన గంగ..ఇప్పుడు మీకా ఛాన్స్ లేదు నా కొడుకును ఇచ్చేస్తే తీసుకుపోతా అంటుంది. నా మాట వినకుండా DNA టెస్ట్ కి ఒప్పుకున్నారు కదా ఇప్పుడు తగ్గేదేలే అంటుంది...నీకెంత కావాలని భైరవి అడిగితే ఆస్తిలో సగం వాటా ఇవ్వమని గంగ అంటుంది..
ఇంట్లో బంటి టిఫిన్ మొత్తం తినేసి అక్కడే ఉన్న అరటిపళ్లు తీసుకెళ్లిపోతాడు. టిఫిన్ పెట్టమని భైరవి వెళితే ఆ బకాసురుడు తినేశాడని చెబుతుంది పంకజం.
ఇంతలో సత్య వచ్చి..అత్తయ్యా ఇప్పుడు ఆకలి గురించి కాదు ఆ గంగ మీ స్థానం తీసుకునేలా ఉంది జాగ్రత్తపడండి అంటుంది. రేణుక కూడా వచ్చి మరింత రెచ్చగొడుతుంది
మహదేవయ్య దగ్గరకు వెళ్లిన క్రిష్.. ఏమైనా సమస్య ఉందా చెప్పు అంటాడు. నా దగ్గర దాపరికాలు లేవని మహదేవయ్య అంటే.. దాపరికాలు నా దగ్గరేనా పెనిమిటీ అని పంచ్ వేస్తుంది. గంగ టార్చర్ తట్టుకోలేకపోతున్నానని ఏడుస్తుంది భైరవి. క్రిష్ తల్లికి సర్దిచెబుతాడు.
సత్య వచ్చి ఆ గంగ అత్తయ్యని సతాయిస్తోందని చెబుతుంది. జమయ్మ-రేణుక వచ్చి రెండు రోజులు ఓపిక పట్టమంటుంది. గంగ ధైర్యం చూస్తుంటే భయం వేస్తోంది దానికి ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుందాం అంటోందని భైరవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అలా చేస్తే పరువు పోతుందని క్రిష్ అంటాడు.
సత్యభామ నవంబరు 30 ఎపిసోడ్ లో... DNA టెస్ట్ శాంపిల్స్ తీసుకునేందుకు వస్తారు.. ఇప్పటికైనా నిజం బయటపెడితే మంచిది అంటుంది సత్య.. మహదేవయ్య ఏం చేస్తాడో చూడాలి...