Satyabhama Serial Today January 9th Highlights: వేట మొదలుపెట్టిన రుద్ర.. క్రిష్ ఎదురుతిరగాల్సిన టైమొచ్చేసింది - సత్యభామ జనవరి 9 ఎపిసోడ్ హైలెట్స్!
నామినేషన్ పేపర్లపై సంతకం పెడతానని జయమ్మ అనడంతో కథ మంచి మలుపు తిరిగింది. సత్యపై సెటైర్లు వేసిన మహదేవయ్యకి రివర్స్ క్లాస్ వేస్తుంది సత్య. రుద్ర చేయొత్తి కొట్టబోతుంటే మహదేవయ్య అడ్డుపడతాడు. ఆ చేయి వదిలితే మళ్లీ జైలుకి పోతాడంటూ ఇచ్చిపడేస్తుంది సత్య
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇంట్లో అందరూ నామినేషన్ పేపర్లపై సంతకం చేసినట్టు సత్యకు కలవస్తుంది. అది నిజంగా పీడకలే వెళ్లి కాళ్లు కడుక్కుని వచ్చి దేవుడి దగ్గర బొట్టు పెట్టుకుని పడుకో అంటాడు. నా కల నిజం కావాలని కోరుకోవచ్చు కదా అంటుంది. నీ పుట్టింటోళ్లు సంగతి సరే కానీ మా అమ్మ సంతకం చేయడం అంటే జరిగేపనా అంటాడు
మంచంపై ఆ చివర ఒకరు ఈ చివర ఒకరు నిద్రపోతే పీడకలే వస్తుంది అంటాడు క్రిష్. ఆ తర్వాత తనకు వచ్చిన కల చెప్పి సిగ్గుపడుతుంటాడు. కాసేపు నవ్వుకుంటారు. అసలు వరంగల్ ఎలక్షన్ లేకుండా బ్యాన్ చేస్తే బావుండును...హాయిగా మనం రోజూ నవ్వుకుంటూ ఇలానే ఉండొచ్చు అంటాడు. నిన్ను ఇబ్బందిపెడుతున్నా అని తెలుసు క్రిష్ అనుకుంటుంది
నావైపు నిజాయితీ ఉంటే గెలిపించు దేవుడా అని కోరుకుంటుంది సత్య. ఇంతలో వృద్ధాశ్రమం నుంచి వచ్చిన పెద్దావిడ ఆశ్రమంలో ఉన్న 30 మందిలో ఆరుగురుం నీకు అండగా ఉండాలని నిర్ణయింటుకున్నాం అంటుంది. సంతోషిస్తుంది సత్య.
ఇవన్నీ కాకులులాంటివి ఎగిరిపోతాయ్ అంటాడు మహదేవయ్య. నా బలం ఇప్పుడు 8కి పెరిగింది అంటుంది సత్య. తొమ్మిది సత్యా అంటూ రేణుక వస్తుంది. ఈ ఇంట్లో ఏ కష్టంవచ్చినా నాకు అండగా నిలబడింది నువ్వే సత్యా..అందుకే నేను నీకు ఇప్పుడు సపోర్ట్ చేస్తా అంటుంది.
రేణుకపై ఫైర్ అవుతున్న రుద్రకి క్లాస్ వేస్తుంది సత్య. నువ్వు మధ్యలో రావొద్దంటాడు రుద్ర. బామ్మని ఎవరైనా ప్రశ్నించారా..కొడుకు పోటీలో ఉండగా సత్యకి సపోర్ట్ చేసిన బామ్మది తప్పుకానప్పుడు నాదెలా తప్పు అవుతుంది అంటుంది. హ్యాపీగా సపోర్ట్ చేసుకో వదినా అంటాడు క్రిష్
సత్య బయటకు వెళ్లాలని క్రిష్ ని పిలుస్తుంది. బాపుతో వెళ్లాలి అంటాడు క్రిష్. అవతలివాళ్ల ప్రాణాలమీదకు వచ్చిందన్నా రావా అంటుంది సత్య. తొందరగా వెళదాం పద అంటుంది సత్య..ఎవరికి ఏమైందని అడుగుతాడు క్రిష్
రూమ్ లో రేణుక జుట్టు పట్టుకుంటాడు రుద్ర..తిరగబడతా అని ఎదురుతిరుగుతుంది రేణుక.
ఇద్దరు కోడళ్లకు లోకువ అయిపోయావ్ అంటాడు రుద్ర. సత్య పొగలు తట్టుకోవడం నావల్ల కావడం లేదంటాడు మహదేవయ్య. దాన్ని పారిపోయేలా చేస్తానంటాడు రుద్ర
సత్యభామ జనవరి 10 ఎపిసోడ్ లో... ఎక్కడికి వెళుతున్నాం చెప్పు సత్యా అని క్రిష్ అడుగుతాడు. ఈలోగా రుద్ర కాల్ చేస్తాడు.. సంబంధం లేని ముసలోళ్లని రక్షించేందుకు మొగుడిని తీసుకెళ్లావ్..మరి మీ నాయనను ఎవరు రక్షిస్తారని అనడంతో షాక్ అవుతుంది సత్య.