Satyabhama Serial Today January 16th Highlights: సైలెంట్ గా చిచ్చు పెట్టేసిన సంజయ్.. సత్య నామినేషన్ పై క్రిష్ సంతకం - సత్యభామ జనవరి 16 ఎపిసోడ్ హైలెట్స్!
నామినేషన్ కి బయలుదేరుతాడు మహదేవయ్య. వెళ్లేది నామినేషన్ వేసేందుకే ఈ హడావుడి అంతా ఎందుకు అంటుంది సత్య. మా బాపు నామినేషన్ వేయడం అంటే గెలిచినట్టే అని రుద్ర రివర్సవుతాడు. ఇంట్లో కనీసం పది మంది అయినా ఉన్నారు ఆమె స్పీచ్ వినేందుకు..బయటకు వెళ్లితే ఆమె మాట వినేదెవరు అంటాడు సంజయ్.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్రిష్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు.నువ్వేం మాట్లావడవేం అని భైరవి అంటే...ఇక్కడున్న అందరకీ అన్నీ తెలుసు అంటాడు క్రిష్. మహదేవయ్యకి హారతి ఇచ్చేందుకు భైరవి సిద్ధమవుతుంటే నన్ను సపోర్ట్ చేస్తూ ఆయనకు హారతిస్తారేంటి అంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే విజయ తిలకం దిగ్గి హారతిస్తా అంటుంది సత్య. సరే అంటాడు మహదేవయ్య.
బొట్టు పెడుతూ ఇది పరాజయ తిలకం అంటుంది సత్య. సత్యా నీక్కూడా హారతి ఇవ్వాలి కదా అంటుంది రేణుక...నాకు కావాల్సింది గెలిచాక తీసుకునే విజయ హారతి అంటుంది సత్య. నువ్వు సత్యతో వెళతావా నాతో వస్తావా అంటాడు మహదేవయ్య..క్రిష్ మహదేవయ్య చేయి తీసుకుని భుజంపై వేసుకుంటాడు.. అంతా వెళ్లిపోతారు
ఆ ఇంటి నుంచి సత్యకి ఓ మనిషి మిస్సవుతుంది బిగ్ డాడ్ అనుకున్న పని పూర్తిచేశానంటాడు సంజయ్. అంతా కలసి స్టెప్పులేస్తూ నామినేషన్ కి బయలుదేరుతారు. భైరవి కూడా వస్తానంటే..నువ్వు చిన్నకోడలికి కదా సపోర్ట్ ఆమెతో రా అంటాడు..
సంధ్య ఎక్కడికో బయలుదేరడం చూసి ఈ రోజు సత్య నామినేషన్ కి సంతకం చేసేందుకు వెళ్లాలి కదా అంటారు. కంప్యూటర్ క్లాస్ కి వెళ్లి అట్నుంచి అటే వచ్చేస్తానని అబద్ధం చెబుతుంది. సత్య టెన్షన్ పడుతుంది కదా అని అందరూ అంటే.. నువ్వు వెళ్లమ్మా ఆ టైమ్ కి వచ్చేసెయ్ అంటాడు హర్ష..
నీ పుట్టింటోళ్లు ఏరి అంటుంది భైరవి.. అదిగో వస్తున్నారు వెళ్లి పలకరించు అంటుంది జయమ్మ. వాళ్లు ఆడపిల్లల తాలూకా నేను పలకరించను అంటుంది. నీ ఇంటి ఆడపిల్ల కూడా అక్కడుంది అంటుంది జయమ్మ.
సంధ్య కనిపించడం లేదంటని సంజయ్ అంటే..కంప్యూటర్ క్లాస్ కి వెళ్లింది వస్తుంది అంటారు. సత్య పుట్టింటోళ్లు వచ్చారు నాకు నిశ్చింతగా ఉందనుకుంటాడు క్రిష్. అంతా కలసి లోపలకు వెళతారు..నర్సింహ కూడా అప్పుడే వస్తాడు..
నీ కొడుకులు తండ్రి దిక్కు నిలబడితే... భైరవి, జయమ్మ, రేణుక అందరూ సత్యదిక్కు నిలబడ్డారు..నీ ఫ్యామిలీ చీలిపోయినట్టుందే చేతకాని వాడిలా కూర్చుండిపోయావా ..నీలో ఏదో లోపం ఉంది మహదేవయ్య అంటాడు. అంతే కదా చిన్న కోడలా అని సత్యని మధ్యలోకి లాగుతాడు.. రుద్ర పైర్ అవుతాడు.
నర్సింహంగాడిని చంపెయ్ రా అని రుద్ర అంటే.. క్రిష్ అడుగు ముందుకువేస్తాడు సత్య ఆపుతుంది. ఈ టైమ్ లో గొడవ పడితే మంచిది కాదంటాడు. పెండ్లాం చెప్పిందని ఆగిపోయావా అంటాడు రుద్ర. నామినేషన్ నుంచి గొడవలు మొదలు పెడితే ఎలక్షన్ ఆపించేస్తా అంటాడు ఆఫీసర్. ఇదంతా నీవల్లే అంటే సత్యపై ఫైర్ అవుతుంది భైరవి.
సత్యభామ జనవరి 17 ఎపిసోడ్ లో సంధ్య నామినేషన్ కి రావడం లేదని చెప్పేసింది..ఇప్పుడు క్రిష్ వ్యూహం ఏంటో చూడాలి...