Satyabhama Serial February 12th Episode Highlights: ఎగ్జిట్ పోల్స్ సత్యకే అనుకూలం.. పెద్ద స్కెచ్చే వేసిన మహదేవయ్య - సత్యభామ ఫిబ్రవరి 12 ఎపిసోడ్ హైలెట్స్!

క్రిష్ కాల్ మాట్లాడుతుంటే వెళ్లిన సత్య.. భుజంపై తలపెట్టుకుని బాధపడుతుంది. సంజయ్ కి లవర్ ఉందని బాబాయ్ చెప్పాడు కాబట్టి నీకు ఆ అనుమానం బలపడిపోయిందంటాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
నీ మనసులో చాలా అపార్థం ఉంది..దాన్ని తగ్గించడం చాలా కష్టం అంటాడు క్రిష్. నా మనసులో ఉన్నది అపార్థం కాదు నా చెల్లెలుకి ఏమవుతుందో అనే భయం అని లోలోపలే బాధపడుతుంది

సంధ్య మనం ఇక కలసి ఉండం..మీ అక్క 24 గంటలు మనకోసమే ఆలోచిస్తోంది..మనల్ని ఎలా విడదీయాలా అని ఆలోచిస్తోంది అంటాడు. మనకు ఫస్ట్ నైట్ కూడా జరగనివ్వదు అంటాడు. ఈ రోజు రాత్రే ఫస్ట్ నైట్ అంటుంది సంధ్య. మా ప్రెండ్ రిసార్ట్ కి వెళదాం అని ప్లాన్ చేస్తాడు
కోడలు కాని కోడలా నీకు ఈ రాత్రికే గడువు ముగిసిపోతుంది అంటాడు. నువ్వు ఎలక్షన్స్ లో వెనక్కు తగ్గుతావో లేదంటే నీ చెల్లెలు ఫొటోకి దండ వేస్తావో రెడీ అవు అంటాడు
సంధ్య కనిపించడం లేదని సత్య కంగారుగా వెతుకుతుంది. కాల్ చేద్దాం అనుకుంటుంది ఇంతలో ఇద్దరూ బయటినుంచి వస్తారు. ఎక్కడికి వెళ్లారని అడిగితే.. మా ఫ్రెండ్ రిసార్ట్ లో ఫస్ట్ నైట్ జరుపుకున్నాం అంటారు.
సత్య కోపంగా సంధ్యని కొడుతుంది..నీ భార్యని కొడుతుంటే చూస్తూ ఊరుకున్నావేంటి సంజయ్ అంటుంది సంధ్య. తప్పు చేసింది కాక ఏంటీ దబాయింపు అంటుంది జయమ్మ. నన్ను క్వశ్చన్ చేసేముందు మీ ముద్దుల మనవరాలిన అడగండి అని మెండిగా మాట్లాడుతుంది
సంధ్య-సత్య మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. నా జీవితంలో నిప్పులు పోయాలని చూస్తున్నావ్ అని ఫైర్ అవుతుంది. బావగారు అక్కను ఎవరైనా డాక్టర్ కి చూపించండి అంటుంది.
క్రిష్ బలవంతంగా సత్యను బయటకు తీసుకెళ్లిపోతాడు. సంధ్య సేఫ్టీ నాకు విడిచిపెట్టు..నువ్వు ప్రశాంతగా ఉండు అంటాడు. నేను ఎలక్షన్ నుంచి విత్ డ్రా అయితేనే సంధ్యకి సేఫ్టీ అనుకుంటుంది
సత్యభామ ఫిబ్రవరి 13 ఎపిసోడ్ లో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వస్తాయి.. అందులో మొత్తం సత్యే గెలుస్తుందని తేలుతుంది. అది చూసి అభ్యర్థి చచ్చిపోతే ఎలక్షన్స్ ఆగిపోతాయ్ అంటూ రుద్రకి ఏదో ప్లాన్ చెప్తాడు మహదేవయ్య