Karthika Deepam: పాపం మళ్లీ వంటగదిలోనే దీపక్క!
స్మాల్ స్క్రీన్ బాహుబలి అనిపించుకున్న కార్తీకదీపం సీరియల్ మళ్లీ వస్తోంది. నవ వసంతం పేరుతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తున్నాయ్..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా వచ్చిన ప్రోమోలో శౌర్యను చదువుకోమని చెప్పి వంటలక్క చకచకా ఇంట్లోకెళ్లి మొత్తం పనులు చేసుకుంటూ పోతుంది. ఇంతలో దిగాలుగా కూర్చున్న శౌర్య పాప దగ్గరికి డాక్టర్ బాబు వస్తాడు. ఈరోజు స్కూల్లో ఫాదర్స్ డే.. పిల్లలు అందరూ వాళ్ల నాన్నలతో వెళ్తున్నారట.. మా నాన్న ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు అంటూ శౌర్య బాధపడుతుంది. అయితే గడ్డాలు, మీసాలు పెట్టుకుని నన్ను వచ్చేమంటావా అంటూ డాక్టర్ అంటాడు. ఇంతలో దీప ఎంట్రీ ఇస్తుంది. ఏమనుకోకండి డాక్టర్ బాబూ అని దీప అంటే..నీకు అర్థమవుతుందా.. ఆ పసి హృదయం తండ్రి ప్రేమ కోసం తపిస్తుంది.. పంతాలు, పట్టింపులకి పోకుండా ఒకసారి ఆలోచించు అంటూ డాక్టర్ బాబు సలహా ఇస్తాడు. బంధానికి, బాధ్యతలకి విలువ ఇవ్వని వ్యక్తి గురించి ఆలోచించను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇంతకీ శౌర్యకి తండ్రి తనే అని డాక్టర్ బాబుకి తెలియదా? దీప తన భార్య అని తెలియదా? గడిచిన కార్తీకదీపానికి కొనసాగింపా? కొత్త కథా? అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది..
ఏదైమైనా దీపక్కకి మళ్లీ వంట తప్పలేదని బాధపడిపోతున్నారు అభిమానులు...
ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)