Satyabhama Serial Niranjan: ఆ యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే.. 'సత్యభామ' సీరియల్ క్రిష్ గురించి ఈ విషయాలు తెలుసా మీకు!
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో యష్ గా తెలుగు స్మాల్ స్క్రీన్ పై మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు నిరంజన్. క్లాస్ గా కనిపించి మెప్పించిన నిరంజన్..ప్రస్తుతం సత్యభామ సీరియల్ లో క్రిష్ గా తనలో మాస్ యాంగిల్ పరిచయం చేశాడు..
1996 జన్మించిన నిరంజన్ పుట్టింది , చదువుకున్నది మొత్తం బెంగళూరులోనే. తల్లి ఉపాధ్యాయురాలు...తండ్రి క్యాటరింగ్ బిజినెస్ చేసేవాడు. చిన్నప్పటి నుంచీ ఆర్మీలో జాయిన్ అవ్వాలని కలగన్నాడు నిరంజన్
ఆర్మీలోకి వెళ్లాలనే పట్టుదలతో స్కూల్, కాలేజీలో NCC కూడా చేశాడు..స్పోర్స్ లో యాక్టివ్ గా పాల్గొనేవాడు. కానీ యాక్సిడెంట్ తన జీవితాన్ని మార్చేసింది.. లిగమెంట్ దెబ్బతినడంతో ఆర్మీలో చేరాలన్న కల కలగానే మిగిలిపోయింది. ఆర్మీ ఆశలు వదులుకుని రెడీయో జాకీగా అవతారం ఎత్తాడు..ప్రస్తుతం సీరియల్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు నిరంజన్..
కన్నడ స్మాల్ స్క్రీన్ పై 'గాంధారి' తో నటనలోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఆతర్వాత నందిని సీరియల్ లో నటించాడు..తెలుగు, తమిళం, మలయాళంలో ప్రసారం అయిన ఈ సీరియల్ తో నిరంజన్ క్రేజ్ పెరిగింది..అవకాశాలూ పెరిగాయ్..
సత్యభామ సీరియల్ క్రిష్ (image credit :Niranjan/Instagram)
సత్యభామ సీరియల్ క్రిష్ (image credit :Niranjan/Instagram)