Guppedantha Manasu Mukesh Gowda: 'గుప్పెడంతమనసు' సీరియల్ లో రిషి ఎందుకు కనిపించడం లేదో తెలుసా!
మోడల్ గా కెరీర్ ఆరంభించి బుల్లితెరపై అడుగుపెట్టిన ముఖేష్ గౌడకి తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి క్రేజ్ వచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగుప్పెడంత మనసు సీరియల్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్టైంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ, కుటుంబ సంబంధాల మధ్య ఉండే భావోద్వేగాలు కావడంతో యూత్ కూడా ఈ సీరియల్ ని బాగానే ఫాలో అవుతున్నారు
అయితే కొన్నాళ్లుగా రిషి సీరియల్ లో కనిపించడం లేదు. రిషిని శైలేంద్ర కిడ్నాప్ చేశాడంటూ స్టోరీ నడిపిస్తున్నారు కానీ రిషిని చూపించడం లేదు ఏం జరిగిందా అని ఫ్యాన్స్ అంతా కంగారుపడ్డారు. దీనిపై క్లారిటీ ఇచ్చాడు మహేంద్ర భూషణన్ గా నటిస్తోన్న సాయికిరణ్.
జ్యోతీరాయ్ ఈ మధ్యే ఈ సీరియల్ లో చనిపోయి జగతి క్యారెక్టర్ కి చెక్ పెట్టేసి వెబ్ సిరీస్, మూవీస్ లో బిజీగా ఉంది. ఇప్పుడు రిషి కూడా హీరోగా టర్న్ అవుతున్నాడు. దీంతో రిషి క్యారెక్టర్ కూడా ముగించేస్తారా అనే డిస్కషన్ నడిచింది. కానీ అదేం లేదని క్లారిటీ ఇచ్చాడు మహేంద్ర భూషణ్. త్వరలోనే రిషి వస్తున్నాడని క్లారిటీ ఇచ్చాడు
జిమ్లో ప్రాక్టీస్ చేస్తుండగా ముఖేష్ గాయపడ్డాడట. గాయం కాస్త తీవ్రంగానే ఉండటంతో డాక్టర్స్ బెడ్ రెస్ట్ సజెస్ట్ చేశారట. అందుకే షూటింగ్ కి రాలేదు రిషి. త్వరలోనే జాయిన్ అవుతాడనే క్లారిటీ రావడంతో హమ్మయ్య అంటున్నారు ఫ్యాన్స్.
ఇప్పుడు హీరోగా టర్న్ అవుతున్నాడు ముఖేష్
ఎస్.ఎస్.ఎం.జి ప్రొడక్షన్స్ పతాకంపై ముఖేష్గౌడ, ప్రియాంక శర్మ జంటగా నూతన దర్శకుడు రుద్ర దర్శకత్వంలో వ్యాపారవేత్త కె. దేవానంద్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. దివాలీ సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ‘గీతా శంకరం’ అనే టైటిల్ ప్రకటించారు.