Guppedantha Manasu Mukesh Gowda: రూమర్స్ నమ్మకండి - క్లారిటీ ఇచ్చేసిన 'గుప్పెడంత మనసు' రిషి
గుప్పెడంత మనసు సీరియల్ రిషి లేకుండానే సాగుతోంది. జగతి మరణం - రిషి మిస్సింగ్ మిస్టరీ తో కొన్ని నెలలు నడిపించారు...ఇప్పుడు అనుపమ-మను చుట్టూ కథ తిరుగుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇక రిషి (ముఖేష గౌడ) రీ ఎంట్రీ లేనట్టేనా? మూడునెలల్లో రిషి సర్ ని తీసుకొస్తానన్న వసుధార మాట ఏమైందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. పైగా ఏవేవో గొడవలు జరిగాయని అందుకే రిషి మళ్లీ రాలేదన్న వార్తలు వైరల్ అయ్యాయి..వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చాడు రిషి..
ఈ మధ్య తనకు సంబంధించి చాలా రూమర్స్ వస్తున్నాయని..ముఖ్యంగా గుప్పెడంత మనసు సీరియల్ లో రీ ఎంట్రీపై చాలా పుకార్లు షికార్లు చేశాయన్న ముఖేష్ గౌడ..అవన్నీ నమ్మొద్దన్నాడు.
‘గుప్పెడంత మనసు’ సీరియల్ ప్రొడక్షన్ హౌస్, ఛానల్‌తో పాటు తన టీమ్ మద్దతంతా తనకుందని...వారితో వివాదాలంటూ వార్తలు క్రియేట్ చేయొద్దని చెప్పుకొచ్చిన రిషి...రీ ఎంట్రీ ఎప్పుడన్నది స్వయంగా నేను చెప్పినప్పుడే నమ్మండి అంటూ పోస్ట్ పెట్టాడు...
అందమైన ప్రేమకథగా మొదలైన గుప్పెడంతమనసు సీరియల్ ఇప్పుడు ఊహించని మలుపులతో నడుస్తోంది. ప్రేమకథ కాస్త క్రైమ్ స్టోరీగా మారిపోయింది. మరి రిషి రీఎంట్రీ ఎప్పుడుంటుందో ఏమో..వెయిట్ అండ్ సీ...
గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ) Image Credit: Mukesh Gowda/ Instagram
గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ) Image Credit: Mukesh Gowda/ Instagram