Karthika Deepam 2 March 7th Highlights : శ్రీధర్‌తో రెస్టారెంట్లో ప్లేట్లు కడిగించి..కార్తీక్, దీప రొమాన్స్.. పారుకి డివోర్స్ ఇస్తోన్న శివన్నారాయణ, కార్తీక దీపం 2 ఎపిసోడ్ హైలెట్స్
శ్రీధర్ రెస్టారెంట్లో మహిళలకు బిల్ లేదు. నా రిలేటివ్కి బిల్ లేదు. చిన్నమ్మకి బిల్ లేదు కాబట్టి నువ్వు బిల్ కట్టి వెళ్లు అని చెప్తాడు. (Image Credit: Jiostar/ Star Maa)
పర్స్, ఫోన్ లేకపోవడంతో శ్రీధర్ వడ్డీ డబ్బుల్లో కట్ చేసుకోమంటాడు. అలా కుదరదు ప్లేట్లు కడుగు. ఒక్కో ప్లేట్‌కి 1 రూపాయి అంటూ.. ప్లేట్లు కడిగిస్తాడు. (Image Credit: Jiostar/ Star Maa)
శ్రీధర్ని చూసి కార్తీక్, కావేరి నవ్వుకుంటారు. దీప వద్దు లేండి ఆపించేద్దామంటుంది. కావేరి ఆయనకి రాని పని చేయిస్తే ఎలా కార్తీక్ అని అడుగుతుంది. (Image Credit: Jiostar/ Star Maa)
ఆయనకు కూరగాయలు కట్ చేయడం బాగా వచ్చు. అంటే సరే కూరగాయలే కట్ చేయించండని చెప్తాడు కార్తీక్. దీంతో ఎపిసోడ్ ఫన్నీగా సాగింది. (Image Credit: Jiostar/ Star Maa)
మరోవైపు శివన్నారాయణ వీలునామ రాయించేందుకు లాయర్ని పిలుస్తాడు. లాయర్ ఎందుకు పిలిచారని అని అడిగితే నీకు డివోర్స్ ఇవ్వడానికని చెప్తాడు శివన్నారాయణ. దీంతో పారు ఏడుస్తుంది. (Image Credit: Jiostar/ Star Maa)
మరోవైపు దీప, కార్తీక్ ఓ డాక్యుమెంట్ కోసం వెతుకుతూ ఉంటారు. దానిలో ఓ ఫోటో పడిపోతే కార్తీక్ కంగారుగా ఫోటో లాగేసుకుంటాడు. దీంతో ఎవరిదా ఫోటో అని అడుగుతుంది. (Image Credit: Jiostar/ Star Maa)
ఇది నన్ను కాపాడిన నా ప్రాణదాత ఫోటో. నేను చూస్తానని అడుగుతుంది. దీంతో కార్తీక్ తను కనిపిస్తే ముందు నీకే చూపిస్తానని చెప్తాడు. (Image Credit: Jiostar/ Star Maa)
లేదు తాను ఇప్పుడే ఫోటో చూస్తానంటూ లాగేసుకుంటూ ఫోటోకోసం గొడవ పడుతుంది. దానిలో భాగంగా ఇద్దరూ మంచపై పడిపోతారు. కార్తీక్‌పై పడ్డాను అనే సోయ కూడా లేకుండా దీప ఫోటో లాక్కోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: Jiostar/ Star Maa)