Karthika Deepam 2 January 23rd Highlights : ఆల్మోస్ట్ దొరికిపోయిన జ్యోత్స్న.. శౌర్యను మిస్ అవుతూ కంటతడి పెట్టిన దీప, దిక్కు తోచని స్థితిలో కార్తీక్

దాసు విషయంలో పోలీసులు జ్యోత్స్న ఇంటికి వెళ్తారు. దీంతో జ్యోత్స్నతో పాటు దశరథ్ కూడా తెగ టెన్షన్ పడుతూ ఉంటాడు. దాసుపై అటాక్ జరగకముందు చివరిసారిగా ఇక్కడికే వచ్చాడంటూ పోలీసులు అడిగే సరికి జ్యోత్స్న దొరికిపోయామనుకుని టెన్షన్ పడుతుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
శివనారాయణ పారిజాతంని నీ కొడుకు ఇక్కడికి వచ్చాడా అని అడుగుతాడు. లేదు రాలేదని చెప్పడంతో చూశారా? అతను ఇక్కడికి వస్తే వాళ్ల అమ్మను కలవకుండా ఉంటాడా? అని ఒకవేళ మీకు డౌట్ ఉంటే సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేసుకోమని చెప్తాడు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

దశరథ్.. జ్యోత్స్న దొరికిపోయిందనుకుంటాడు. అయితే అప్పటికే సీసీ టీవీ ఫుటేజ్‌ని జ్యోత్స్న డిలేట్ చేస్తుంది. దీంతో పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోతారు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
శౌర్యని ఆస్పత్రిలో జాయిన్ చేసి ఇంటికి వచ్చిన కార్తీక్‌కి దీప గుమ్మం దగ్గర కనిపిస్తుంది. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావా? అప్పటినుంచి లోపలికి వెళ్లలేదా అని అడిగితే.. దీప మీరు తీసుకెళ్లింది నా ప్రాణాన్ని అంటూ ఏడ్చేస్తుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
రౌడీకి కాశీ పాప్‌కార్న్ ఇస్తాడు. శౌర్య హ్యాపీగా ఫీల్ అయ్యి తిని పడుకుంటుంది. దీంతో పాప తిని పడుకుందని కార్తీక్‌కి మెసేజ్ పెడతాడు కాశీ.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
పాప ఫోటో చూసుకుని దీప ఏడుస్తుంది. దీంతో కార్తీక్ ఏడుస్తూ.. నువ్వు ఏమి చేసినా పాప వారం అక్కడే ఉంటుంది. శౌర్యకి కష్టమొచ్చి.. దానిని నేను తీర్చలేకపోతే నేను చచ్చినట్టే లెక్క అంటూ ఎమోషనల్ అవుతాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
దీప శౌర్యకి ఫోన్ చేయమని కార్తీక్‌ను అడుగుతుంది. పాప పడుకుని ఉంటుంది. ఇప్పుడు మనం ఫోన్ చేస్తే బాధతో రాత్రంతా ఏడుస్తుంది అని చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తి అవుతుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)