Karthika Deepam 2 April 7th Highlights : దీపతో కలిసి ముగ్గులు వేసిన కార్తీక్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన గౌతమ్, జ్యోత్స్నతో పెళ్లి కన్ఫార్మ్.. కార్తీక దీపం 2 హైలెట్స్
శివన్నారాయణ దశరథ్, సుమిత్ర దగ్గరికి వచ్చి గుడ్ న్యూస్ అని చెప్తాడు. గౌతమ్ సారీ చెప్పి.. జ్యోత్స్నను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నట్లు చెప్తాడు.(Image Credit: jio+ Hotstar)
జ్యోత్స్నకి ఈ విషయం అప్పుడే చెప్పొద్దని డిసైడ్ అయ్యారు. కానీ జ్యోత్స్న పక్కనుంచి వినేసి.. ఈ గౌతమ్‌ని దీప పని చూడమంటే ఇంకా నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడనుకుంటుంది. (Image Credit: jio+ Hotstar)
ఓ వైపు దీప ముగ్గేస్తుంది. దీంతో కార్తీక్ దీపని చూసి హెల్ప్ చేయనా అని అడుగుతాడు. నేను వంట చేయట్లేదు. ముగ్గు వేస్తున్నాను ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది. (Image Credit: jio+ Hotstar)
వీరిద్దరూ ముగ్గు వేస్తున్నప్పుడు శౌర్య వచ్చి ఫోటోలు దిగుతుంది. అందరూ కలిసి సంతోషంగా ఫోటోలకు ఫోజులిస్తారు. (Image Credit: jio+ Hotstar)
గౌతమ్‌కి జ్యోత్స్న ఫోన్ చేసి.. నువ్వు దీప పని చూడు అని చెప్తుంది. దీపని కంట్రోల్ చేయకపోతే జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం అవ్వదేమోనని ఆలోచిస్తాడు గౌతమ్. (Image Credit: jio+ Hotstar)
కాంచన దీపను పిలిచి.. కార్తీక్ నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాడో తెలీదు. కానీ.. అప్పటి నుంచి సంతోషంగా ఉన్నావు. ఎప్పుడూ ఇలానే ఉంటానని నాకు మాట ఇవ్వు అని అడుగుతుంది. (Image Credit: jio+ Hotstar)
ఈలోపు గౌతమ్ వచ్చి దీపకు వార్నింగ్ ఇస్తాడు. రెస్టారెంట్‌కి, పాపకి హాని చేస్తానని బెదిరిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తి అయింది. (Image Credit: jio+ Hotstar)