Komalee Prasad: అందాల కోమలీ మళ్ళీ వచ్చింది రోయ్... ఆ స్మైలూ, గ్లామరూ చూశారా?
Jiohotstar Web Series Touch Me Not Actress: కోమలీ ప్రసాద్ మళ్లీ వచ్చారు. సోషల్ మీడియాలోకి కాదండీ... కొత్త వెబ్ సిరీస్ తో జియో హాట్ స్టార్ ఓటీటీలోకి! అందాల కోమలి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు చూడండి. (Image Courtesy: komaleeprasad / Instagram)
నవదీప్ ప్రధాన పాత్రలో నటించిన టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4న జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కోమలి ప్రసాద్ ఒక కీలక పాత్ర చేశారు. (Image Courtesy: komaleeprasad / Instagram)
'దసరా' ఫేమ్, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి సరసన కోమలి ప్రసాద్ 'టచ్ మీ నాట్' వెబ్ సిరీస్ లో కనిపించారు. స్టూడెంట్ అండ్ పోలీస్... రెండు వేరియేషన్స్ ఉన్న పాత్ర చేశారు. లుక్స్ పరంగా వేరియేషన్ చూపించడంతో పాటు నటిగా ఆకట్టుకున్నారు. (Image Courtesy: komaleeprasad / Instagram)
'టచ్ మీ నాట్' వెబ్ సిరీస్ కోమలి ప్రసాద్ ను మరోసారి ప్రేక్షకులకు గుర్తు చేసింది. ఆవిడ నటనకు మంచి మార్కులు పడ్డాయి. (Image Courtesy: komaleeprasad / Instagram)
సినిమాల విషయానికి వస్తే న్యాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న 'హిట్ 3'లో కోమలి ప్రసాద్ ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. అది కాకుండా రక్షిత్ అట్లూరి జంటగా శశివదనే అని మరొక సినిమా చేశారు అది విడుదలకు రెడీ అవుతుంది. (Image Courtesy: komaleeprasad / Instagram)
కోమలి ప్రసాద్ సహా టాలీవుడ్ అందాల భామల ఫోటో గ్యాలరీల కోసం తాజా రాజకీయ సినిమా వార్తల కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి. (Image Courtesy: komaleeprasad / Instagram)