Karthika Deepam 2 April 4th Highlights : మనది దేవుడు కలిపిన బంధం దీప.. నా ప్రాణధాతే నా భాగస్వామి అని చెప్పేసిన కార్తీక్, కార్తీక దీపం 2 ఎపిసోడ్ హెలైట్స్
దీప, కార్తీక్ ఇంటికి వస్తారు. రెస్టారెంట్ ఓనర్ని కలవాలని చెప్తాడు కార్తీక్. దీంతో దీప సైలెంట్‌గా ఉంటుంది.
ఏమైందని అడిగితే మీరు నాకు దూరంగా ఉండండి. నావల్లే మీరు ఈ పరిస్థితిలో ఉన్నారని బాధపడుతుంది. నావల్లే ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్తుంది.
సరే రెస్టారెంట్‌కి కాదు కానీ గుడికి రా. నా ప్రాణదాత కనిపించింది. తనని నీకు చూపిస్తాను అని తీసుకువెళ్తాడు. దీపను నీటి దగ్గరకు తీసుకెళ్తాడు.
నీటిలో దీప ప్రతిబింబాన్ని చూపించి తనే ప్రాణధాత అని చెప్తాడు. దీప షాక్ అవుతూ.. కళ్లలో నీళ్లు తెచ్చుకుని దూరంగా వెళ్లిపోతుంది.
కార్తీక్ దీప దగ్గరకు వెళ్లి ఆ రోజు జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేస్తాడు. అలాగే తనకి దీపనే ప్రాణదాత అని ఎలా తెలిసిందో కూడా చెప్తాడు.
నువ్వు నన్ను దూరంగా వెళ్లిపో అంటున్నావు. ఇప్పుడు చెప్పు ఇది జాలితో జరిగిన పెళ్లినా? దేవుడు కలిపిన బంధమా అని అడుగుతాడు.
దీప సంతోషంగా నవ్వుతుంటే నువ్వు నాకు బాటసారి కాదు దీప నా భాగస్వామివి అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగింది.