Brahmamudi Serial Today ఏప్రిల్ 4 ఎపిసోడ్: కళావతి కోసం తపించిపోతున్న రాజ్.. రుద్రాణిని టార్గెట్ చేసిన అప్పు స్వప్న - బ్రహ్మముడి ఏప్రిల్ 04 ఎపిసోడ్ హైలెట్స్!
కావ్యని పదే పదే ఇబ్బండిపెడుతున్న రుద్రాణి పనిపట్టాలని డిసైడ్ అవుతుంది స్వప్న. అదే విషయం అప్పుతో చెబుతుంది. కావ్యకు తోడుగా నిలవాల్సింది పోయి పిచ్చిదాన్ని చేస్తోంది కదా..రివర్స్ లో మా అత్తను పిచ్చిదాన్ని చేయాలి అంటుంది
ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారని ఆలోచిస్తున్నా అంటుంది అప్పు. ఆవిడకు నా మొగుడు తోడుగా ఉంటాడు.. ముందు వాడిని ఇంట్లోంచి పంపించి అప్పుడు అత్తపని పట్టాలి అంటుంది
టీనా పేరుతో కాల్ చేసి రాహుల్ ని కలవాలని ఉందని చెబుతుంది స్వప్న. ఎక్కడకు రావాలని అడిగితే మీ ఆవిడ ఏమీ అనదా అంటుంది. నాకు పెళ్లేకాలేదని అబద్ధం చెప్పి బయలుదేరుతాడు రాహుల్.
హడావుడిగా వెళుతున్న రాహుల్ ని ఎక్కడికి అని స్వప్న అడిగితే అర్జెంట్ పని ఉందని చెబుతాడు.
కళావతిని బాధపెట్టానా అని రాజ్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తాడు. మీ తప్పేంలేదు నాకు తలనొప్పిగా ఉందంటుంది కావ్య. మీ అడ్రస్ పెట్టండి ఇద్దరం కలసి హాస్పిటల్ కి వెళదాం అంటాడు
రాజ్ ప్రేమకు కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను మీకు నిజంగా తెలియదా అని మళ్లీ అడిగేసరికి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాల్ కట్ చేస్తుంది
నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చానంటూ రాజ్ చేతిలో కారు తాళాలు పెడుతుంది యామని. ఈ కారు నీదే నువ్వు ఎక్కడికైనా వెళ్లొచ్చు అంటుంది.
పెళ్లి ఫోటో చూసుకుని ఏడుస్తున్న కావ్యను ఓదార్చుతాడు సుభాష్. నీ ఉహల్లోంచి బయటకురా ఇలా నిన్ను చూడలేకపోతున్నాం అంటాడు. మా ఆయన బతికే ఉన్నారని కావ్య అంటే..ఎక్కడున్నాడని నిలదీస్తాడు సుభాష్.
రుద్రాణిని టార్గెట్ చేస్తారు అప్పు, స్వప్న. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని వంటలు ఘుమఘుమలాడిపోతున్నాయ్ అంటారు. స్పెషల్ ఏంటా అని మూతతీసి చూస్తే బతికి ఉన్న చేపలు కనిపిస్తాయ్.. రుద్రాణి పిచ్చిదానిలా చూస్తుంటుంది
కావ్యకు కాల్ చేస్తాడు రాజ్... ఛార్జింగ్ పెట్టడంతో అపర్ణని కాల్ లిఫ్ట్ చేయమంటుంది...మళ్లీ శ్రీవారు అని నంబర్ సేవ్ చేసిన విషయం గుర్తొచ్చి కంగారుగా వెళుతుంది కావ్య