Guppedantha Manasu Rishi: రిషి కాదు... పేరు మార్చుకున్న 'గుప్పెడంత మనసు' యాక్టర్ - అసలు కారణం తెలుసా?

పేరు మార్చుకున్న 'గుప్పెడంత మనసు' రిషి... కొత్త పేరు ఏంటో తెలుసా?
తెలుగు టీవీ సీరియల్స్ చూసే ప్రేక్షకులకు, 'గుప్పెడంత మనసు' అభిమానులకు రిషి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, అతని అసలు పేరు అది కాదని తెలుసా? సీరియల్ లో క్యారెక్టర్ పేరుతో తెలుగునాట ఈ కన్నడ నటుడు పాపులర్ అయ్యాడు. (Image Courtesy: _mukesh_gowda5/ Instagram)
'గుప్పెడంత మనసు' రిషి అసలు పేరు ముఖేష్ గౌడ. అయితే, ఇప్పుడు ఆ పేరు కూడా అతను మార్చుకున్నాడు. టీవీ నుంచి సినిమాల్లో అడుగు పెట్టడం కోసం కొత్త పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. (Image Courtesy: _mukesh_gowda5/ Instagram)
'ప్రియమైన నాన్నకు' అని కన్నడ, తెలుగు సినిమా చేస్తున్నాడు రిషి. ఆ మూవీ అనౌన్స్‌మెంట్, కాన్సెప్ట్ పోస్టర్ మీద 'నిహార్ ముఖేష్' అని రాసి ఉంది. అదీ సంగతి! ఇక నుంచి రిషి అలియాస్ ముఖేష్ గౌడ కాస్త నిహార్ ముఖేష్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. (Image Courtesy: _mukesh_gowda5/ Instagram)
'గుప్పెడంత మనసు' సీరియల్‌కు శుభం కార్డు పడటంతో ఇప్పుడు సినిమాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నాడు నిహార్ ముఖేష్. (Image Courtesy: _mukesh_gowda5/ Instagram)
నిహార్ ముఖేష్ హీరోగా గతంలో 'గీతా శంకరం' అని ఓ సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ మూవీ డిలే అయినట్టు ఉంది. ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత మళ్ళీ అప్డేట్స్ లేవు. (Image Courtesy: _mukesh_gowda5/ Instagram)