Guppedantha Manasu: ‘గుప్పెడంత మనసు’ ఏంజెల్ గోదావరి జిల్లా పిల్లే!
గుప్పెడంత మనసు’ సీరియల్‌లో రిషి(ముఖేష్ గౌడ) ఫ్రెండ్ గా నటిస్తోన్న ఏంజెల్ అసలు పేరు అవంతిక మున్ని..ఊరు కాకినాడ.
ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయిన రిషిపై శైలేంద్ర అటాక్ చేయిస్తాడు. ఆసమయంలో హాస్పిటల్లో చావుబతుకుల్లో ఉన్న రిషిని కాపాడి అండగా నిలబడుతుంది ఏంజెల్. మొదట్లో ఈమె రిషిని ప్రేమిస్తుందేమో అనుకున్నారు కానీ మంచి ఫ్రెండ్ ని మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది ఏంజెల్.
ఏంజెల్ గా నటిస్తూ ఫుల్ మార్క్స్ కొట్టేసిన అవంతిక గతంలో గుప్పెడంత మనసు సీరియల్‌కి ముందు.. అత్తారింటికి దారేది, పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్స్‌లో నటించింది.
గతంలో పలు సినిమాల్లోనూ నటించింది. నాలుగేళ్లక్రితం వచ్చిన రొమాంటిక్ క్రిమినల్స్ మూవీలో బోల్డ్ పాత్రలో కనిపించింది అవంతిక. ‘అబ్బో నా పెళ్లంట’, 'ఐపీఎల్', 'అంతేలే కథ అంతేలే', 'బీకాంలో ఫిజిక్స్' వంటి సినిమాల్లోనూ నటించింది. అయితే ఈ సినిమాలన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఈమె గురించి పెద్దగా తెలియలేదెవ్వరికీ. ఇప్పుడు గుప్పెడంతమనసు సీరియల్ తో మాత్రం ఫాలోయింగ్ సంపాదించుకుంది ఏంజెల్ అలియాస్ అవంతిక
గుప్పెడంతమనసు ఏంజెల్(అవంతిక)Image Credit: Avanthika Munni/ Instagram