Guppedanta Manasu Suresh Babu: గుప్పెడంత మనసు కొత్త విలన్ శైలేంద్ర గుంటూరు కుర్రాడే తెలుసా!
‘గుప్పెడంత మనసు’ సీరియల్లోకి కొత్త విలన్ వచ్చాడు. రిషిని ఢీ కొట్టేందుకు రంగంలోకి దిగాడు శైలేంద్ర భూషన్. స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్న ఈ కొత్త కుర్రాడు ఈ సీరియల్లో కొత్తే కానీ.. బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం పాతే.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగుప్పెడంత మనసులో శైలేంద్రగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడి అసలు పేరు సురేష్ బాబు. గుంటూరుకి చెందిన సురేష్ బాబుకి చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో డిగ్రీ పూర్తైన తర్వాత ‘ముత్యాల ముగ్గు’ సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఈ సీరియల్ లో అప్పలరాజు పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది..ఆ తర్వాత ఆడదే ఆధారం సీరియల్లో పోలీస్ ఆఫీసర్‌గానూ మెప్పించాడు.
సూర్యవంశం, సిరిసిరి మువ్వలు రాజారాణి, నువ్వానేనా, శ్రీనివాస కళ్యాణం, శ్రీమంతుడు, ఆడదే ఆధారం ఇలా వరుస సీరియల్స్‌తో నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఓ వైపు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో మెరిశాడు సురేష్ బాబు. చిన్నదాన నీకోసం, కీచక, సరైనోడు సినిమాల్లోనూ నటించాడు.
ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాసరావు అంటే తనకి ఇష్టం అన్న సురేష్ బాబు..వాళ్లలా పవర్ ఫుల్ విలన్ గా నటించాలనుందంటున్నాడు. ఇప్పటివరకూ ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో విలన్ అంటే దేవయాని. అప్పుడు దేవయాని కొడుకుగా శైలేంద్ర భూషన్ విలనిజం పండిస్తున్నాడు.
అన్నదమ్ముల మధ్య పోరుతో ‘గుప్పెడంత మనసు’ సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. తెలుగు సీరియల్స్‌లో మగ విలన్లు కనిపించడమే అరుదు. అలా అరుదైన పాత్రతో శైలేంద్ర భూషన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సురేష్ బాబు ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూద్దాం...
గుప్పెడంత మనసు శైలేంద్ర( సురేష్ బాబు) Image Credit: Suresh Babu/ Instagram