Gunde Ninda Gudi Gantalu February 12th Episode Highlights: ప్రభావతి కన్నింగ్ ప్లాన్ కి చెక్ పెట్టిన బాలు - గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 12 ఎపిసోడ్ హైలెట్స్

పుట్టింటికి వెళ్లిన మీనా అత్తవారింట్లో పడిన ఇబ్బందులన్నీ చెప్పుకుని బాధపడుతుంది. తల్లి తాళి చేయించి ఇస్తానంటే వద్దనేస్తుంది. తన భర్త చేయించినప్పుడు వేసుకుంటానని సవాల్ చేశానని చెబుతుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In App
మీనా ఇంటికి లేటుగా రావడంతో ప్రభావతి రెచ్చిపోతుంది. ఇంతసేపు ఎక్కడికెళ్లావ్ అని నిలదీస్తుంది. సామాన్లకోసం నాలుగు షాపులు తిరిగావా ఊరు మొత్తం బలాదూర్ గా తిరిగావా అని ఫైర్ అవుతుంది. ఇంకోసారి సామాన్లకు పంపించేటప్పుడు త్వరగా తీసుకొచ్చేవారిని పంపించండి అని ఇచ్చి పడేస్తుంది మీనా.

రోహిణి, మనోజ్ , శృతి, రవి , తనకు మావయ్యకు అంటూ మనిషికో కర్రీ చేయమని ఆర్డర్ వేస్తుంది ప్రభావతి. అంతమంది పేర్లు చెప్పి అందులో తన పేరు, తన భర్త పేరు లేకపోవడంతో నిలదీస్తుంది. ఈ సరుకులకు డబ్బులిచ్చింది ఆయనే కదా అని నిలదీస్తుంది.
ఇంటి పని, వంటపని రెస్ట్ లేకుండా చేయించి సాధిస్తూనే ఉంటుంది. ఇంతలో మీనా తల్లి పార్వతి వస్తుంది. పార్వతిని హేళనగా మాట్లాడుతుంది ప్రభావతి. తన కూతురి మెడలో పసుపు తాడు చూసి బాధగా అనిపించింది అందుకే నాకు మాంగళ్య భాగ్యం లేదుకదా ఆ తాళిని కూతురికోసం చేయించి తీసుకొచ్చానంటుంది
అప్పుడే అత్తింట్లో విషయాలన్నీ పుట్టింట్లో చెప్పేసిందాఅని ఫైర్ అవుతుంది. నీ కూతురి మెడలో మంగళసూత్రం లాక్కోలేదు దానికే పొగరెక్కి ఇచ్చేసింది అంటుంది ప్రభావతి. ఇలా బంగారం తెచ్చి ఇస్తే అత్తయ్యని అవమానించినట్టు కాదా అని రోహిణి ఆజ్యం పోస్తుంది
బాలుకి మండిపోతుంది...దీంతో మీనాకు కనీసం తల్లి ఉంది నీకు ఉన్నారో లేరో దేవుడికే తెలియాలి అంటాడు. ఇంతవరకూ నీ పుట్టింటి నుంచి తులం బంగారం అయినా తెచ్చావా అని ఫైర్ అవుతాడు. తన అత్తగారిగురించి గొప్పగా మాట్లాడుతాడు. నన్ను అర్థం చేసుకునే భర్త ఉన్నాడు..ఈ బంగారంతో పనిలేదంటుంది మీనా.
పార్వతి వెళ్లిపోయిన తర్వాత.. ప్రభావతి దగ్గరకు వెళ్లిన సత్యం.. నీ కూతురుని గొప్పింటికి ఇచ్చావ్..ఆ ఇంట్లో పరిస్థితి ఇలానే ఉంటే నీ కూతురు పరిస్థితి ఏంటి అంటాడు. ఓ అత్తలా కాదు ఆడదానిలా ఆలోచించు అంటాడు
మరోవైపు ప్రభావతి కూతురు మౌనిక అత్తగారింట్లో నానా కష్టాలు పడుతుంది..సంజయ్ తనని పనిమనిషి కన్నా అధ్వాన్నంగా ట్రీట్ చేస్తాడు. తన అన్నయ్యలు చెప్పినా విననందుకు ఫలితం అనుభవిస్తున్నా అని బాధపడుతుంది మౌనిక.
ఆఫీసులో మళ్లీ జాయిన్ అవమని కాల్ వస్తుంది. ఈ విషయం సంజయ్ కి ఎలా చెప్పాలా అని టెన్షన్ పడుతుంది మౌనిక
గుండెనిండా గుడిగంటలు ఫిబ్రవరి 13 ఎపిసోడ్ లో.. కిచెన్ ను లీజుకి తీసుకున్నావా అని బాలు సెటైర్స్ వేస్తాడు. నువ్వు చేస్తుంటే అంతా తింటుంటారు కదా.. ఈ రోజు చెప్తా అందరి పని అంటాడు బాలు