Gunde Ninda Gudi Gantalu May 15th Episode: అత్తారింట్లో బాలుకి అవమానం.. ఛీకొట్టిన మీనా, ప్రభావతి పైశాచిక ఆనందం - గుండె నిండా గుడి గంటలు మే 15 ఎపిసోడ్ హైలెట్స్!
ఇంటికి వచ్చిన మీనా తల్లిని దారుణంగా అవమానిస్తుంది ప్రభావతి. వాళ్లని తిరిగి వెళ్లిపొమ్మని మీనా చెబుతుంది..అలా తప్పు అని చెప్పి లోపలకు పిలుస్తాడు సత్యం. నీ కొడుకు ఏదో తప్పుచేస్తూ కంటపడి ఉంటాడు అందుకే బాలుగాడు కొట్టాడు అంటుంది ప్రభావతి
ఎందుకు వచ్చారో చెప్పేసి వెళ్లండి అంటుంది మీనా. మా ఆయన సంవత్సరికం అందుకే పిలిచేందుకు వచ్చానంటుంది పార్వతి. ఇంకా ప్రభావతి సూటిపోటి మాటలు అంటూనే ఉంటుంది. జరిగిన యాక్సిడెంట్ తలుచుకుని బాధపడతాడు సత్యం
పోయినవాడు పోయాడు..అందుకే కదా అరిష్టం మా ఇంటికి పట్టుకుందని నోరు పారేసుకుంటుంది ప్రభావతి. మీరు మర్యాదగా మాట్లాడండి అంటుంది సుమతి. ఇంట్లోకి రానివ్వడమే మర్యాద అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది.
మా అమ్మను మరోసారి అవమానిస్తే ఊరుకునేది లేదని ఫైర్ అవుతుంది మీనా. శ్రుతి వాళ్ల అమ్మ, రోహిణి వాళ్ల మావయ్య వస్తే అంత హడావుడి చేస్తారే..మా అమ్మను గుమ్మం నుంచి వెళ్లగొడతారా అని నిలదీస్తుంది.సంస్కారం తెలియని ఈ ఇంటికి రావొద్దని అందుకే చెప్పానని ఫైర్ అవుతుంది మీనా
సభ్యత, సంస్కారం లేని మనిషి మాటలు పట్టుకుని మీ అమ్మను వెళ్లిపొమ్మంటావా అని మీనాతో అంటాడు సత్యం. గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో నోర్మూసుకుని ఊరుకుంటుంది ప్రభావతి. తల్లిని సాగనంపేందుకు బయటకు వెళ్లిన మీనాను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇలాంటి అత్తగారితో ఎలా వేగుతున్నావో అని బాధపడుతుంది
అప్పుడే బాలు వస్తాడు..పార్వతి పలకరించినా ఏమీ మాట్లాడకుండా వచ్చేస్తాడు. లోపలకు వచ్చిన బాలుతో గొడవపడుతుంది మీనా. సంవత్సరికాలకు వెళ్లేందుకు ఇష్టం లేదని చెబుతాడు..సత్యం గట్టిగా చెప్పడంతో సరే అంటాడు
డబ్బింగ్ స్టూడియోకి వెళ్లిన శ్రుతిని కలుస్తుంది తల్లి. నీకేమైమా డబ్బు సమస్య ఉందా సైకిల్ పై తిరుగుతున్నావ్ అంటుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటుంది.
ఉద్యోగం మానసాను అని చెప్పిన మనోజ్ పై ఫైర్ అవుతుంది రోహిణి. పదే పదే జాబ్ పోతే ఏమనుకోవాలి అని నిలదీస్తుంది
సంవత్సరికానికి వెళ్లిన బాలుని అవమానిస్తాడు శివ. చాచిపెట్టి కొడతాడు బాలు..అంతా షాక్ అవుతారు