Saraswathi Pushkaralu: సరస్వతి పుష్కరాల్లో పాల్గొని స్నానమాచరించిన సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
జ్ఞాన సరస్వతీ పుష్కరఘాట్‌లో మంత్రులు పొంగులేటి, పొన్నం, శ్రీధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్కర స్నానం చేశారు.
పుష్కర స్నానానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్ఞాన సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేశారు.
మే 15న ప్రారంభమైన పుష్కరాల్లో తొలి స్నానం తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ చేశారు.
మే 15న ప్రారంభమైన సరస్వతీ పుష్కరాలు మే 26 వరకు సాగనున్నాయి.
భారీగా తరలి వస్తున్న భక్తులు పుష్కర స్నానాలు చేసిన తర్వాత ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.
భక్తుల కోసం రోజూ సాయంత్రం 6.45 గంటల నుంచి 7.35 అంటే గంటపాటు సరస్వతిదేవీకి నవరత్న మాల హారతి ఇస్తున్నారు.
పుష్కర స్నానం ఆచరించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరస్వతిదేవీకి నవరత్న మాల హారతిని తిలకించారు.
భక్తులంతా పుష్కరాలకు వచ్చి పుణ్యస్నానాలు చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేస్తోందని అన్నారు.
వచ్చే ఏడాది జరిగే గోదావరి, కృష్ణా పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు.
వచ్చే ఏడాది జరిగే గోదావరి, కృష్ణా పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు.