✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Gunde Ninda Gudi Gantalu May 13th Episode:కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న రేంజ్ లో శివని బాలు ఎందుకు కొట్టాడన్న సస్పెన్స్ - గుండె నిండా గుడి గంటలు మే 13 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  13 May 2025 08:17 AM (IST)
1

ఏదో జరగబోతోందని బామ్మ ముందే ఊహించినట్టుంది అని ఆ రోజు ఆర్థరాత్రి దిష్టితీసిన విషయం గుర్తుచేసుకుంటాడు బాలు.. వెంటనే మీనాకు నిజం చెప్పేయాలి అనుకుంటాడు

2

మీనాకు అసలు విషయం చెప్పేద్దాం అని కిందకు వెళతాడు. ఏదో చెప్పేందుకు వచ్చి ఆలోచిస్తున్నారు అనుకుంటుంది మీనా. కాసేపు అక్కడే తటపటాయించి ఏమీ చెప్పకుండానే వెళ్లిపోతాడు బాలు

3

ఏం చేసినా, ఎలా ప్రవర్తించినా పడి ఉంటుందిలే అనే అలుసు అని బాధపడుతుంది మీనా..నాకేనా పౌరుషంలేనిది అనుకుంటుంది మీనా..

4

గుణ వచ్చి క్యాబ్ డ్రైవర్లకు వార్నింగ్ ఇచ్చి కార్లు తీసుకెళ్తాను అంటాడు. బాలు వచ్చి క్షమాపణ చెప్తే మీ ఫ్రెండ్స్ ని క్షమించి వదిలేస్తా అంటాడు గుణ. వద్దురా బాలు అంటాడు రాజేష్..

5

అడ్డదారులు తొక్కే అడ్డగాడిదవి నీకు క్షమాపణలు చెప్పడం ఏంటి..ఇదిగో నీకు ఇవ్వాల్సిన డబ్బు అని మొత్తం క్లియర్ చేసేస్తాడు బావు. షాక్ అవుతాడు గుణ. డబ్బు ఇచ్చినట్టు సాక్ష్యంగా వీడియో కూడా తీయిస్తాడు బాలు. నా కారు అమ్మేసి మీ అప్పు తీర్చానని బాలు చెప్పడంతో రాజేష్ షాక్ అవుతాడు.

6

శివ దగ్గరకు వెళుతుంది మీనా. అక్కకి ఏదో అయినట్టుంది అంటుంది సుమతి. మీ ఆయన నిన్ను కూడా కొట్టాడా అని అడుగుతాడు శివ. ఇంతలో సత్యం వచ్చి శివ ఆరోగ్యం గురించి ఆరాతీస్తాడు. అల్లుడు గారు ఇంత తొందరపడ్డారెందుకు అని బాధపడుతుంది మీనా తల్లి.

7

కొంత డబ్బు ఇచ్చి తీసుకోనని అడుగుతాడు సత్యం. వద్దన్న పార్వతి..అల్లుడి గారికి కోపం వస్తే ఆలోచించరు అని అర్థం అయిపోయింది.. రేపు మీనాపై కోపం వస్తే ఏం చేస్తారో అనే భయంగా ఉంది..అలాంటి ఆవేశపరుడితో నా కూతురు ఎలా బతుకుతుందో అని భయం ఉంది అంటుంది

8

బాలు మంచి చెడు విచక్షణ తెలియని మూర్ఖుడు కాదమ్మా ప్రేమ చూపించే వాళ్లకోసం ప్రాణం ఇస్తాడు..ఆ విషయంలో నాదీ హామీ అంటాడు సత్యం. తప్పుగా అనుకోకండి మావయ్య అని చెబుతుంది మీనా. ఆయనకు ఆవేశం వచ్చినా ఏదో కారణం ఉంటుంది అంటుంది మీనా. శివ టెన్షన్ పడతాడు

9

హోటల్ కి వచ్చిన ఓ వ్యక్తిని చూసి వీడు ఇప్పుడు డబ్బులు అడుగుతాడు ఏమో అని భయపడి దాక్కుంటాడు మనోజ్. ఆ వ్యక్తి వచ్చి మనోజ్ ని చూసి అప్పు చెల్లించేందుకు టార్గెట్ పెడతాడు.

10

గుండెనిండా గుడిగంటలు మే 14 ఎపిసోడ్ లో.. నీకోపం నీ మూర్ఖత్వం నీ మంచితనాన్ని దహించేస్తోందని బాధపడతాడు సత్యం. బాలుని నిలదీస్తాడు. అసలు వాడిని ఎందుకు కొట్టానో తెలుసా అని ...పక్కనే మీనా ఉండడంతో ఆపేస్తాడు బాలు...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Gunde Ninda Gudi Gantalu May 13th Episode:కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న రేంజ్ లో శివని బాలు ఎందుకు కొట్టాడన్న సస్పెన్స్ - గుండె నిండా గుడి గంటలు మే 13 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.