Gunde Ninda Gudi Gantalu April 30th Episode: బాలు రోహిణి మధ్య మసాలా దోశ రచ్చ ..మనోజ్ హోటల్ కే వెళ్లిన ప్రభావతి కామాక్షి - గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 30 ఎపిసోడ్ హైలెట్స్!!
మనోజ్ నిద్రలో కలవరిస్తాడు..రెస్టారెంట్లో ఉన్న ఫుడ్ ఐటెమ్స్ అన్నీ లిస్ట్ చెబుతాడు. అది విని షాక్ అవుతుంది రోహిణి. మనోజ్ ని నిద్రలేపి ఏంటిది అని అడుగుతుంది. మార్నింగ్ ఓ రెస్టారెంట్లో టిఫిన్ చేశాను అప్పుడు చూసిన లిస్ట్ మర్చిపోలేదు అంటాడు
మగాళ్లకు హీరోయిన్లు కల్లోకి వస్తారు కానీ ఇలా రెస్టారెంట్ ఫుడ్ ఐటెమ్స్ లిస్ట్ వస్తుందా అని మనోజ్ ని ఆటపట్టిస్తుంది రోహిణి. వెయిటర్ అని పదే పదే అనొద్దు అంటాడు.
రూమ్స్ లోంచి సరదాగా నవ్వులు వినిపించడంతో హాల్లో పడుకున్న ప్రభావతి ఫైర్ అవుతుంది. అర్థరాత్రి ఈ గోలేంటి అంటుంది. కొడుకులు కోడళ్లు సంతోషంగా ఉంటే చూడలేవా అంటాడు సత్యం.
చుట్టూ తిరిగి బాలు మీనాని టార్గెట్ చేస్తుంది. వాళ్లు లేకపోతే ఆ రూమ్ లో పడుకునేవారం అంటుంది. కావాలంటే వీధిలోకి వెళ్లి పడుకో అంటాడు సత్యం. ఏమీ చేయలేక నోర్మూసుకుని నిద్రపోతుంది ప్రభావతి
తెల్లారేసరికి మీనా అందరకీ టిఫిన్ రెడీ చేసి పెడుతుంది. రోహిణి మాత్రం మనోజ్ కి మసాలా దోశ ఆర్డర్ చేసి తీసుకొస్తుంది. ఆ విషయం మీనాకు చెప్తుంది మాకోసం టిఫిన్ చేయొద్దని.
టిఫిన్ టేబుల్ పై పెట్టి లోపలకు వెళుతుంది రోహిణి. ఇంతలో బాలు వచ్చి ఈ పూలగంప నాకోసం టిఫిన్ తెచ్చి పెట్టినట్టుంది అనుకుని తినేస్తాడు. ఇంతలో రోహిణి వచ్చి ఫైర్ అవుతుంది
సభ్యత గురించి నాతోనే మాట్లాడుతున్నావా అని బాలు..రోహిణి అసలు సంగతి బయటపెట్టేస్తా అంటాడు. బాలుని అడ్డుకుంటాడు సత్యం. ఏదో చెప్తాను అంటున్నాడు చెప్పనీయండి అంటుంది ప్రభావతి
అయినా టిఫిన్ తీసుకొస్తే ఒకరికోసం కాదు అందరికోసం తీసుకురావాలి కదా అంటాడు సత్యం. ఈ గోల ఆగేది లేదని భావించిన శ్రుతి అందరకీ టిఫిన్ ఆర్డర్ చేస్తుంది..సమస్య అక్కడ ముగిసిపోతుంది
ఎలాగైనా బాలు మీనాని ఇంట్లోంచి పంపించేయాలని నిర్ణయించుకున్నా అని కామాక్షితో చెబుతుంది ప్రభావతి. బాలుని సపోర్ట్ చేస్తుంది కామాక్షి. ఆకలేస్తోంది అనుకుంటూ మనోజ్ పనిచేసే హోటల్ కి వెళతారు. వీళ్లను చూసి మనోజ్ లోపల దాక్కుంటాడు.
మనోజ్ ని తిడుతూ బయటకు రమ్మంటాడు రెస్టారెంట్ ఓనర్. మనోజ్ పేరు వినిపించడంతో ప్రభావతి, కామాక్షి షాక్ అవుతారు.
గుండెనిండా గుడిగంటలు మే 01 ఎపిసోడ్ లో ఇంట్లో దోమల మందు కొడుతుంది శ్రుతి. ఆ వాసనకు సత్యం గుండెపట్టుకుని కూలబడిపోతాడు. కంగారుగా హాస్పిటల్ కి తీసుకెళుతుంది మీనా.. ఆవిషయం బాలుకి కాల్ చేసి చెబుతుంది