Brahmamudi Serial Today October 16th Episode: రాజ్ కి నో చెప్పిన కావ్య, చచ్చేదాకా భరించాలన్న స్వప్న, రుద్రాణి రచ్చ - బ్రహ్మముడి అక్టోబరు 16 ఎపిసోడ్ హైలెట్స్!
కనకం, మూర్తి పెళ్లి రోజు సందర్భంగా కేక్ కట్ చేస్తారు..అందరూ కేక్ తినిపించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. రుద్రాణి, ధాన్యలక్ష్మికి ఇష్టంలేకపోయినా కేక్ తినిపిస్తారు.
మీకు పెళ్లై 25 ఏళ్లు, నాకు పెళ్లై 50 ఏళ్లు, నా కొడుకు సుభాష్ కి పెళ్లై 30 ఏళ్లు అయిందంటూ మొదలుపెట్టిన ఇందిరాదేవి..బంధం గొప్పతనం గురించి చెబుతుంది. కావ్య-రాజ్ కి అర్థమయ్యేలా మాట్లాడుతుంది.
క్షమించరాని తప్పులు జరిగినా నేను అత్తింటి గడపదాటలేదు..పుట్టింటికి, అత్తింటికి మచ్చతెచ్చే పని చేయలేదు..గాయం అయినా శరీరం మనదే పోయిన నాడు తప్ప మన శరీరాన్ని వదిలివెళ్లిపోలేం..కాపురం కూడా అంతే అంటుంది అపర్ణ....
కనకం కూడా తన భర్త గురించి చెబుతూ..చివరకు ఇల్లు తాకట్టుపెట్టి కుటుంబాన్ని రోడ్డున పడేసినా కానీ నాతోనే ఉన్నారని చెబుతుంది.
అప్పు-కళ్యాణ్ కూడా తామెంత సంతోషంగా ఉన్నామో చెబుతారు.భార్య-భర్త మధ్య ప్రేమ ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదంటారు.
రాహుల్ నన్ను మోసం చేయాలి అనుకున్నాడు..కానీ పెళ్లి తననే చేసుకోవాలి అనుకున్నా...ఇద్దరికీ ఇష్టం లేకపోయినా ఇద్దరం కలసే ఉన్నాం.. చచ్చేవరకూ రాహుల్ భరించాల్సిందే. రాహుల్ కూడా చచ్చేదాకా భరిస్తానంటాడు...
రాజ్ ని మాట్లాడమని అందరూ అంటే..పెళ్లి బంధం ఇలా ఉంటుందా?..ఇకపై మెళుకువలు పాటిస్తానంటాడు. కావ్యను మాట్లాడమంటే... కాపురం అంటే భ్రమ, మాయ..బంధం అంటే ఓ నమ్మకం అది మా ఇద్దరి మధ్యలేదు. తనకి నాపే ప్రేమ లేనప్పుడు ఆ బంధం గురించి నేనేం చెబుతాను అని బాధను వ్యక్తం చేస్తుంది కావ్య..
నువ్వు తప్పులు చేసినా నీ పక్కనే ఉన్నానని రాజ్ అంటే..అసలు తప్పులు చేయనని మీకు తెలియదా అని క్వశ్చన్ చేస్తుంది కావ్య. ఇంతలో దాంపత్య వ్రతం చేసేందుకు సిద్ధమా అని పంతులు రావడంతో అందరూ రెడీ అవుతారు. కావ్య నో అంటుంది.. తనని ఒప్పించే బాధ్యత మీదే అంటూ భారం రాజ్ పై వేస్తుంది కనకం...
అక్టోబరు 17 ఎపిసోడ్ లో...కనకం నాటకం బయటపెట్టి రుద్రాణి రచ్చ మొదలెడుతుంది. అపర్ణ, ఇందిరాదేవి ఏం సమాధానం చెబుతారు? కావ్య రియాక్షన్ ఏంటి? రాజ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు?