Brahmamudi Serial October 11th Episode: లేడీ అక్కినేనిగా జీవించేసిన కనకం .. పండంటికాపురం సినిమా చూపించొద్దన్న కావ్య!
దుగ్గిరాలవారింట్లో అందరూ కలసి భోజనం చేస్తుంటారు.. అమ్మా నాతో కావట్లేదు అంటూ డ్రామా స్టార్ట్ చేస్తాడు ప్రకాశం. కావ్యకు అలా ఉంటే మనం తినడానికి కసాయివాళ్లం కాదంటూ లేచి వెళ్లిపోతారు అపర్ణ, ఇందిరాదేవి. ఏం జరిగిందని రాజ్ అడిగితే..ప్రకాశం మర్చిపోయానని చెబుతాడు.
ఈగో పక్కనపెట్టి ఏం జరిగిందో అడగాల్సిందే అని రాజ్ అనుకుంటాడు. బాగానే నటిస్తున్నారంటూ ఒకర్నొకరు పొగుడుకుంటారు అత్తా కోడళ్లు.. అంతా కనకం సావాసం అనుకుంటారు. ఇంతలో రాజ్ వచ్చి ఏం జరిగిందని అడిగితే బెట్టు చేస్తారు.. సరే కళ్యాణ్ ని అడుగుతా అనడంతో.. అమ్మో ప్లాన్ రివర్సవుతుందని ఆలోచించి...మీ అత్తగారికి క్యాన్సర్ అని చెప్పేస్తారు.
ఇప్పటికే భర్త దూరమై జీవచ్ఛవంలా బతుకుతోంది..ఇప్పు తల్లికూడా దూరమైతే కావ్య తట్టుకోలేదంటూ బాధనటిస్తారు. కనకం ఆఖరి కోరిక విషయం కూడా చెబుదామా అంటారు.. కొంపతీసి కళావతిని కాపురానికి తీసుకురావాలా ఏంటి అంటాడు. నువ్వు మారవ్ .. పాపం తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని అక్కడి నుంచి వెళ్లిపోతారు
కరిగిపోయిన రాజ్..పాపం మా అత్తగారు అనుకుంటూ బయలుదేరుతాడు..ఈ విషయం కనకంకి చెప్పేందుకు కాల్ చేస్తారు అపర్ణ, ఇందిరాదేవి. మరోవైపు కనకం ... ఆగదు ఆగదు సాంగేసుకుని జీవించేస్తుంది. నేను పోయేలోపు ఈ ఇంటిని ముగ్గురు అల్లుళ్ల పేరుమీద రాయండి.. కూతుర్ల పేరుమీదుంటే అల్లుళ్లను లెక్కచేయరు అంటుంది
అత్తయ్యా అంటూ ఎంట్రీ ఇచ్చిన రాజ్.. ఇల్లును ముక్కలు చేయాల్సిన అవసరం లేదంటాడు. మీకేం తెలియదు అని కనకం అంటే.. మా అమ్మ, నానమ్మ చెప్పారంటాడు రాజ్. పెద్ద డాక్టర్ కి చూపిద్దాం పదండి అంటే.. భారీ డైలాగ్స్ కొడుతుంది. నన్ను మీ కొడుకు అనుకుని చివరి కోరిక ఏంటో చెప్పండి అంటాడు రాజ్.
బ్రహ్మముడి అక్టోబరు 12 దసరా రోజు ఎపిసోడ్ లో...కనకం పెళ్లిరోజుకి దుగ్గిరాల కుటుంబం మొత్తం తరలివస్తుంది. రాజ్...కనకంపై ప్రత్యేక అభిమానం చూపిస్తుంటాడు.. కావ్య సెటైర్స్ వేస్తుంటుంది.. ఇంకా ముందుంది అసలు పండుగ అంటాడు రాజ్
రాజ్ వెళ్లిపోతాడు.. కావ్య రావడం చూసి శాలువ పక్కనపెట్టేసి పని చేసుకుంటుంది. ఆయనెందుకు వచ్చారని అడిగితే.. రేపు నీతో కలసి మా పెళ్లిరోజు జరిపిస్తారేమో అంటుంది. అపర్ణ, ఇందిరాదేవికి కాల్ చేసి ప్లాన్ సక్సెస్ అని చెబుతుంది. అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో నిన్ను మించిన తర్వాతే ఎవరైనా అంటారు.