Brahmamudi Serial Today May 16th: రాజ్ కి కాల్ చేసిన అపర్ణ, యామినికి సారీ చెప్పిన రాజ్ - బ్రహ్మముడి మే 16 ఎపిసోడ్ హైలెట్స్!
కావ్యను ఇంప్రెస్ చేసేందుకు బయలుదేరుతాడు రాజ్. ఇంతలో అపర్ణ కాల్ చేసి ఏదైనా ఆలోచించావా అని అడుగుతుంది. సూపర్ డ్రెస్ తో వస్తున్నా అంటాడు రాజ్. నేను అడిగింది డ్రెస్ గురించి కాదు ఐడియా గురించి అని క్లాస్ వేస్తుంది
కళావతి మనసు ఎప్పుడో గెలుచుకున్నావ్..ఇప్పుడు తనని ఇంప్రెస్ చేయాలంటే ఆమె మనసు గెలుచుకోవాలి అంటుంది. నేను హనుమంతుడి టైప్..నువ్వు పక్కన ఉండి ఎంకరేజ్ చేస్తే చాలు అంటాడు. వీడు గతం మర్చిపోయాక నా మాట వింటున్నాడు అనుకుంటుంది
కళ్యాణ్-అప్పు గురించి ప్రకాష్ తో చెప్పి తిడుతుంది ధాన్యలక్ష్మి. ఇద్దరి మధ్యా గొడవ జరుగుతుంది.
రాజ్ రెడీ అవుతుంటే యామిని వస్తుంది.ఎక్కడికి వెళుతున్నావ్ అని అడుగుతుంది. మన చుట్టాల దగ్గరికా అంటే కాదు నాకు వేరే పని ఉంది అంటాడు.
శుభలేఖలు తీసుకొస్తానని మన బంధువులకు చెప్పేశాను అంటుంది యామిని. నాకు వేరే పని ఉంది సారీ అని చెప్పేసి వెళ్లిపోతాడు రాజ్
కళ్యాణ్ అప్పుకి భోజనం తినిపిస్తాడు..అప్పు సారీ చెబుతుంది. నన్ను మా వాళ్లే భరించలేకపోయారు నువ్వెలా భరిస్తున్నావ్ ఇంత ఓపిక ఎలా వచ్చిందని అడుగుతుంది అఫ్పు.
స్వప్న నిద్రలో లేచి రాహుల్ ను చూసి రుద్రాణి అనుకుంటుంది. ఎప్పుడు చూసినా నా ఆస్తి నా ఆస్తి అనుకుంటూ తిరుగుతావ్ అంటూ చెంపలు వాయించేసి వెళ్లిపోతుంది..రాహుల్ షాక్ అవుతాడు
రుద్రాణికి కాల్ చేసిన యామిని..కావ్య ఏం ప్లాన్ చేసిందని అడుగుతుంది. ఈ సారి ప్లాన్ మా వదిన చేసిందని చెప్పేస్తుంది రుద్రాణి. రాజ్ ఇంటికొచ్చే సమయానికి కావ్య ఇంట్లో లేకుండా చేస్తానని తన ప్లాన్ చెబుతుంది
అప్పు ఆఫీసుకి వెళుతుంటే వచ్చి క్లాస్ వేస్తుంది ధాన్యలక్ష్మి...
బ్రహ్మముడి మే 17 ఎపిసోడ్ లో కావ్య ఆఫీసుకి వెళుతుంటే ఇంట్లోనే ఉండమని చెబుతారు అపర్ణ, సుభాష్. యామినికి కాల్ చేసిన రుద్రాణి కావ్యకు పెళ్లైనట్టు ఫొటో చూపిస్తానంటుంది...