Brahmamudi Serial November 18th Episode Highlights: టేబుల్ కింద దాక్కున్న దుగ్గిరాల వారసుడు కళావతి కంటపడితే - బ్రహ్మముడి నవంబరు 18 ఎపిసోడ్ హైలెట్స్!
బ్రహ్మముడి సీరియల్ నవంబరు 18 సోమవారం ఎపిసోడ్ లో హైలెట్ సీన్స్ అంటే ... డిజైన్లు తస్కరించేందుకు కావ్య క్యాబిన్ కి వెళ్లిన రాజ్ దొరికిపోతాడా లేదా అనే..
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCEO పోస్టుని ఎలాగైనా దక్కించుకునేందుకు రకరకాల వేషాలేస్తున్నాడు రాజ్..ముఖ్యంగా కావ్య ఆ ప్లేస్ లో కూర్చోవడం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు అందుకే కావ్యను CEO గా దించేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు
కావ్య CEO గా ఉన్నప్పుడు రాజ్ కనీసం ఆ కంపెనీలో మేనేజర్ గా ఉన్నాడు..కానీ పందెంలో గెలిచి రాజ్ CEO అయితే మాత్రం కళావతి CEO గా దిగిపోవడమే కాదు ఆ కంపెనీ వైపు కన్నెత్తైనా చూడకూడదు..
సీతారామయ్య పెట్టిన ఈ పోటీలో రాజ్ గెలిస్తే కావ్య-రాజ్ శాశ్వతంగా విడిపోతారు..కావ్య గెలిస్తే రాజ్ మళ్లీ ఓ మెట్టు దిగాల్సిందే.. అందుకే కావ్యను ఓడించేందుకు ప్లాన్ చేస్తున్నాడు రాజ్
ఉద్యోగులను రెండు టీమ్స్ గా విడగొట్టిన రాజ్ పందెంలో తను గెలిచేలా చేయాలని చెబుతూ ఎన్నికల హామీల్లా తాయిలాలు ప్రకటించాడు.
కావ్య మాత్రం కష్టంతోనే గెలవాలని ఫిక్సైంది.. పైగా తను దుగ్గిరాల ఇంటి వారసుడు హామీలు ఇస్తే నెరవేర్చగలడు..ఎప్పటికైనా ఈ కంపెనీకి తనే CEO..అందుకే నేను నెరవేర్చలేని హామీలు ఇవ్వనంటుంది
కావ్య డిజైన్లు దొంగిలించేందుకు వెళ్లిన రాజ్...క్యాబిన్లోకి కావ్య రావడం చూసి టేబుల్ కింద దాక్కుంటాడు. హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్లిపోతున్న కావ్య ఈ రూమ్ లోకి ఎవరో వచ్చారు అనుకుంటుంది.. మరి రాజ్ ను చూస్తుందా లేదా అన్నది నవంబరు 18 సోమవారం ఎపిసోడ్ లో తెలుస్తుంది