Brahmamudi Serial November 13th Episode Highlights: కావ్య పోటీలో గెలిచి జీవితంలో గెలుస్తుందా .. రాజ్ ఈగో దిగే టైమొచ్చిందా - బ్రహ్మముడి నవంబరు 13 ఎపిసోడ్ హైలెట్స్!
ఆలయానికి సంబంధించిన నగల డిజైన్ కి సంబంధించి దుగ్గిరాల కంపెనీకి పెద్ద ఆర్డర్ వస్తుంది. మూడు రోజుల్లో డిజైన్లు ఇస్తాం అవి నచ్చితే ముందుకెళదాం అంటుంది కావ్య. బడ్జెట్ గురించి ఆలోచించొద్దని చెప్పేసి ఆ వ్యక్తి వెళ్లిపోతాడు.. శ్రుతిని పిలిచి ఫైల్ గురించి అడుగుతుంది కావ్య..ఇంటికెళ్లిపోయారని చెబుతుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅత్తారింటికి వెళ్లిన కావ్య..రాజ్ ని పిలిచి ఫైల్ పై సంతకం చేసి పంపించమంటే ఇంటికొచ్చారేంటని నిలదీస్తుంది. ఆ కంపెనీతో డీల్ ఇష్టం లేదంటాడు..మీ ఇష్టాలు ఎవరికి కావాలి నాకో మాట చెప్పాలి కదా అని రివర్సవుతుంది.
నాతో డిస్కస్ చేయాలా వద్దా అని రాజ్ నిలదీస్తే.. నేను తీసుకునే నిర్ణయాలను నా కింది వాళ్లతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మిస్టర్ మేనేజర్ అంటుంది
కావ్యకు చెప్పకుండా ఆ ఫైల్ ఇంటికెందుకు తీసుకొచ్చావ్ అని సీతారామయ్య నిలదీస్తారు.. ఇదొక్కటే కాదు ఏ విషయంలోనూ నాకు కోపరేట్ చేయడం లేదు.. ఇంత మేల్ ఈగో ఉన్న మనిషిని నేను చూడలేదని కావ్య అంటే..ఇంత పొగరు ఉన్న ఆడదాన్ని ఎక్కడా చూడలేదంటాడు రాజ్
జరిగింది మొత్తం చెప్పిన కావ్య.. ఆలయానికి సంబంధించి వచ్చిన ప్రాజెక్ట్ గురించి చెబుతుంది కావ్య. ఆ కంపెనీతో డీల్ కుదరాలంటే సమర్థుడైన మీ మనవడు కోపరేట్ చేస్తేనే ఏదైనా సాధించగలను అంటుంది.. నా సమర్థత గురించి మీకన్నా నా శత్రువుకే తెలుసు అని సెటైర్ వేస్తాడు.. పళ్లు రాలుతాయ్ అంటారు ఇందిరాదేవి, అపర్ణ...
మధ్యలో దూరిపోయిన రుద్రాణి..నోటికి పనిచెబుతుంది. కావ్య చేరినవెంటనే 15 కోట్లు లాభం తెచ్చిపెట్టింది అది మర్చిపోయారా అంటుంది స్వప్న. బయటకు వెళ్లిపోయిన క్లైయింట్స్ ని తీసుకొచ్చిందని గుర్తుచేస్తుంది. కానీ రాజ్ తో పోలిస్తే కావ్య తెలివెంత అంటుంది రుద్రాణి.
టెంపుల్ కాంట్రాక్ట్ విషయంలో రాజ్-కావ్య మధ్య పోటీ పెడతాడు సీతారామయ్య. ఈ డిజైన్లు ఎవరు వేసి కాంట్రాక్ట్ మనకు దక్కేలా చేస్తారో వాళ్లే కొత్త సీఈవో అంటాడు. ఇద్దరూ సవాల్ చేసుకుంటారు. ఈ పోటీలో గెలిచినవారికి నగదు బహుమతి ఇవ్వాలంటాడు సుభాష్.
మధ్యలో రుద్రాణి ఎంట్రీ ఇవ్వబోతుంటే అందరూ ఆమె నోరుమూయిస్తారు. ఈ పోటీలో రాజ్ ఓడితే కావ్యను భార్యగా ఇంటికి తీసుకురావాలని కండిషన్ పెడతాడు సీతారామయ్య. కావ్య ఓడితే మళ్లీ కంపెనీవైపు కన్నెత్తి చూడకూడదంటాడు రాజ్.
తాను ఓడితే కాపురమే పోతుందని లోలోపల భయపడుతుంది కావ్య..ఇందిరాదేవి, సీతారామయ్య సర్దిచెప్పి పంపిస్తారు. పోటీలో గెలిస్తే జీవితంలో గెలిచినట్టే అంటారు. పెద్దవాళ్ల మాటలు విన్న కావ్య ఎలాగైనా గెలిచి తీరుతానంటుంది.
బ్రహ్మముడి నవంబరు 14 ఎపిసోడ్ లో డిజైన్లు వేసేందుకు సిద్ధం అవుతారు..