✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi Serial Today October 19th: 'మన్మధుడు' సినిమాలో నాగ్-సొనాలి... 'బ్రహ్మముడి' సీరియల్ లో రాజ్-కావ్య.. సేమ్ సీన్!

RAMA   |  19 Oct 2024 09:00 AM (IST)
1

కోపంగా ఇంటికొచ్చిన రాజ్ ని కన్వెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తారు అపర్ణ, ఇందిరాదేవి. ఎవరేం చెప్పినా కానీ నేను మరోసారి మోసపోవాలి అనుకోవడం లేదనేస్తాడు. చిట్టీ మీరు వాళ్లని కలపాలి అనుకున్న ప్రయత్నం మంచిదే కానీ అందుకోసం నిజాయితీగా ప్రయత్నించండి అంటాడు సీతారామయ్య..

2

ఇదంతా ఎందుకు చేశావ్ అని కావ్య తల్లిని క్వశ్చన్ చేస్తే... కృష్ణమూర్తి భార్యను సమర్థిస్తాడు. మీరిద్దరూ విడిపోయాక అందరం చూస్తుండిపోయాం కానీ మీ అమ్మ మాత్రమే ప్రయత్నం చేసింది.. అందరి ముందు దోషిగా నిలబడినా తల్లిగా గెలిచిందని పొగుడుతాడు. మేం కలుస్తాం అనే నమ్మకం లేదు దీన్ని ఇక్కడితో వదిలేయండి అంటుంది కావ్య... వీళ్లు నేను చస్తేనే కలుస్తారని తెలిస్తే..నిజంగా క్యాన్సర్ వచ్చినా బావుండేదని బాధపడుతుంది కనకం..

3

రాహుల్-రుద్రాణి ఎంజాయ్ చేస్తుంటారు.. ఇంతలో స్వప్న వచ్చి నువ్వు సూపర్ అత్తయ్యా.. ఒక్కమాటతో స్టోరీ మలుపు తిప్పేశావ్ అంటుంది స్వప్న. మీ అమ్మలా నాటకాలు ఆడుతున్నావా అంటే..మేం ఆడే నాటకాలవల్ల ఎవరికీ నష్టం లేదు కానీ మీ వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయ్ అంటుంది. నాకు పుట్టబోయే బిడ్డపై మీ నీడ కూడ పడకుండా మా అమ్మ దగ్గరే పెంచుతాను అంటుంది స్వప్న..

4

ఇందిరా దేవి, అపర్ణ, కనకం ముగ్గురూ కలుస్తారు. రాజ్ మనసులో ఓముద్ర పడితే అది చెరిగిపోదు...వాడి మనసులో కావ్య ఉందని బయటపెట్టాలి అంటుంది అపర్ణ. ఈ సారి వాళ్లిద్దర్నీ కలిపేందుకు తెలివిగా ప్లాన్ చేయాలి అనుకుంటారు. ఇద్దర్నీ ఓ చోట చేర్చితే కానీ పనవ్వదు అంటుంది ఇందిరాదేవి

5

ఆఫీస్ కి వెళ్లిన రాజ్ చిటపటలాటుతుంటాడు.. అపరిచితుడు అమ్మ మొగుడులా ఉన్నాడని శ్రుతి అనుకుంటుంది. డిజైన్స్ తీసుకురా అంటే భయంభయంగా నిల్చుంటుంది. గంటలో డిజైన్స్ తీసుకురా అని ఆర్డర్ వేస్తాడు...

6

అపర్ణ, ఇందిరాదేవి, కనకం ముగ్గురూ కావ్య దగ్గరకు వెళతారు.. లక్ష్మీ, పార్వతి, సరస్వతి కలిసొచ్చారు మళ్లీ ఏదైనా జగన్నాటకం మొదలెట్టారా అంటుంది కావ్య. వాళ్లు ఏం మాట్లాడినా కావ్య సెటైర్స్ వేస్తుంటుంది. అత్తగారన్న గౌరవం లేదా, అత్తగారికి అత్తగారు వచ్చారు భయం లేదా అని అడుగుతుంది. కన్నతల్లి మాట అంటే విలువలేదా అంటుంది కనకం.

7

రుద్రాణి తప్పులేదు..మీ నాటకాన్ని బయపెట్టింది అంతే కదా అని సపోర్ట్ చేస్తుంది... ఇద్దర్నీ కలిపేందుకు ప్రయత్నిస్తే రుద్రాణి కన్నా చీప్ అయిపోయాం అంటుంది అపర్ణ. ఇక ఈ ఇంటి ఛాయలకు కూడా రావొద్దంటారు...సరే వెళ్లండి అంటుంది కావ్య. ముగ్గురూ షాక్ అవుతారు. ఆ తర్వాత రాజ్ కంపెనీలో CEO గా చేరమంటారు.

8

ఉద్యోగిగా చేరితే ఎప్పుడైనా తీసేయొచ్చు తప్పులు వెతికిమరీ అని కావ్య అంటుంది..అందుకే CEO అయితే అని అపర్ణ అంటుంది. ఇదేమైనా బస్ స్టాప్ లో వేసిన కుర్చీనా..ఇందులో కూర్చోవాలంటే అర్హత ఉండాలంటాడు రాజ్.. బ్రహ్మముడి అక్టోబరు 21 ఎపిసోడ్ లో ఇదే హైలెట్ సీన్...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi Serial Today October 19th: 'మన్మధుడు' సినిమాలో నాగ్-సొనాలి... 'బ్రహ్మముడి' సీరియల్ లో రాజ్-కావ్య.. సేమ్ సీన్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.