Brahmamudi Deepika Rangaraju: రాజ్ కి పోటీగా బంగారు నగల వ్యాపారంలో అడుగుపెడుతున్న కావ్య - 'బ్రహ్మముడి' లో ఇదే కీలక మలుపు
ఇష్టంలేదని చెప్పేసిన భర్తకు సమాధానం చెప్పేసి..అత్తింటినుంచి పుట్టింటికి వచ్చిన కావ్య..ఓ వైపు తండ్రికి సహాయం చేస్తూనే మరోవైపు ఉద్యోగం వేటలో పడింది.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు అనామిక రంగంలోకి దిగింది
నగల కంపెనీ ఓనర్ సామంత్ ని లైన్లో పెట్టిన అనామిక.. దుగ్గిరాలవారి వ్యాపారాలను చెడగొట్టేందుకు ప్లాన్ చేసింది. దుగ్గిరాల ఇంటి నుంచి బయటకు వచ్చేసిన కావ్యను సామంత్ కంపెనీకి తీసుకునేందుకు ప్లాన్ చేస్తోంది..
ఆ విషయం కావ్యకు తెలియదు..ఆమె వేసిన డిజైన్లు ఓ వ్యక్తి ఇస్తే వాటిని తను అమ్మి పెడుతుంటాడు..అందుకే ఆ మధ్యవర్తితో డీల్ మాట్లాడే ప్లాన్ లో ఉంది అనామిక. కావ్య ఎప్పటిలా డిజైన్లు వేసి ఇస్తే అవి దుగ్గిరాల వారి కంపెనీకి కాకుండా సామంత్ కంపెనీకి చేరనున్నాయన్నమాట..
కావాలనే కావ్య అలా చేస్తోందని దుగ్గిరాల కుటుంబ సభ్యులు, రాజ్ అపార్థం చేసుకునే అవకాశాలున్నాయి. కానీ కావ్యకు తెలియకుండానే రాజ్ కి మరింత దూరం అవుతోందన్నమాట.
సీరియల్ ఎంత కష్టాలు ఎదుర్కొనే పాత్రలో కనిపిస్తుంది కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది దీపిక రంగరాజు.