Brahmamudi February4th Episode Highlights: రుద్రాణి చాప్టర్ క్లోజ్..ట్విస్ట్ మామూలుగా లేదు - బ్రహ్మముడి ఫిబ్రవరి 4 ఎపిసోడ్ హైలెట్స్!
ఇంట్లో అందరకీ మనపై అనుమానం పెరిగిపోతోందని ఆలోచిస్తాడు రాజ్ మా అమ్మను కూడా అంటాడు. మీ అమ్మనే కాదు ఆడవాళ్లందరినీ తప్పుగా అర్థం చేసుకోవడంలో మీరు డిగ్రీ చేశారేమో అని సెటైర్ వేస్తుంది
ఇద్దరూ బ్యాగులో డబ్బు సర్దడం చూస్తాడు రాహుల్. ఇంత డబ్బు వీళ్లకు ఎక్కడికి అనుకుని అక్కడి నుంచి రుద్రాణి దగ్గరకు వెళతాడు
కొన్ని రోజులు నోరుమూసుకుని ఉందాం అనుకుంటే నన్ను మళ్లీ అందరి ముందూ తిక్కదాన్ని చేశావ్ అని రుద్రాణిపై ఫైర్ అవుతుంది ధాన్యలక్ష్మి . నేనేం చేశానని అన్న రుద్రాణితో రాజ్, కావ్య చేసే ప్రతిపనిని తప్పుగా అర్థం చేసుకుని చివరకు వాళ్లను గొప్పవాళ్లను చేస్తున్నావంటుంది
స్వప్న ఎంట్రీ ఇచ్చి కరెక్ట్ గా చెప్పారు ఆంటీ.. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదాలనుకుంటే ఇలాగే ఉంటుందంటుంది. నన్ను కుక్క అంటావా అని రుద్రాణి అంటే మీ ఇద్దరు బయట గొడవపెట్టుకోండి నాకు తలనొప్పిగా ఉంది అంటుంది ధాన్యం. ఈ ఇంట్లో మీ విలువ ఒకప్పుడు ఎలా ఉండేది మా అత్త మాటలు నమ్మాక ఎలా ఉందో ఆలోచించుకోండి అంటుంది స్వప్న
రాజ్ కావ్య దగ్గర కోట్ల డబ్బు ఉందని రుద్రాణికి చెబుతాడు రాహుల్. ఆ డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేస్తారు.
రాజ్ కావ్య ఆఫీసుకి బయలుదేరుతుంటే ఇద్దరు వ్యక్తులు ఇంటికి వస్తారు. రుద్రాణి షేర్స్ లో ఇన్వెస్ట్ చేశారు మా దగ్గర అప్పుచేశారు 2 కోట్లు అర్జెంటుగా ఇవ్వాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తారు
కావ్య రుద్రాణిపై ఫైర్ అవుతుంది. రెండు రోజులు టైమ్ అడిగి వాళ్లను పంపించేస్తాడు రాజ్. ఆ డబ్బులు కొట్టేయమని రాహుల్ కి చెబుతుంది రుద్రాణి
బ్రహ్మముడి ఫిబ్రవరి 05 ఎపిసోడ్ లో రాహుల్ అరెంజ్ చేసినవారు డబ్బు కొట్టేసి ఆ బ్యాగ్ రాహుల్ కి ఇచ్చేస్తాడు..ఆ తర్వాత వాడిని పట్టుకున్న రాజ్ నిజం తెలుసుకుంటాడు. ఇంట్లో డబ్బులేదన్నప్పుడు ఆ రెండు కోట్లు ఎక్కడివి అని..షేర్స్ కోసం నన్ను చంపేస్తానన్నవాళ్లకి ఎందుకు ఇవ్వలేదంటుంది.
వీళ్లేనా అంటూ షేర్స్ పేరుతో రుద్రాణి అరెంజ్ చేసిన మనుషులను తీసుకొస్తుంది కావ్య...